జీడిమెట్లలో కారు బీభత్సం.. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు | Car Hit A Security Guard In Jeedimetla | Sakshi
Sakshi News home page

జీడిమెట్లలో కారు బీభత్సం.. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు

Aug 11 2024 1:23 PM | Updated on Aug 11 2024 1:39 PM

Car Hit A Security Guard In Jeedimetla

జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది.

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.  కారును  డ్రైవ్‌ చేస్తోన్న మహేష్ గౌడ్ అతివేగం, మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డును ఢీకొట్టాడు.

కారులో మొత్తం ఆరుగురు విద్యార్థులే కాగా,  ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన ఐదుగురు యువకులు పరారయ్యారు.  వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతి చెందిన గోపి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జీడిమెట్లలో రాజీవ్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement