కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు | Two Buses Collided Near Kodada Updates | Sakshi
Sakshi News home page

కోదాడ వద్ద ప్రైవేట్‌ బస్సును వెనుకనుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

Nov 2 2024 7:25 AM | Updated on Nov 2 2024 9:46 AM

Two Buses Collided Near Kodada Updates

సాక్షి,సూర్యాపేటజిల్లా: కోదాడ సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్‌ 2) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. 

గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారందరినీ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్‌ బస్సును గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.   

ఇదీ చదవండి: బాలికపై సామూహిక లైంగికదాడి 

 

Advertisement
 
Advertisement
Advertisement