Road Accident: డిగ్రీ పట్టా అందుకునేందుకు వెళ్తూ.. బీటెక్‌ విద్యార్థి మృతి | BTech student died in a road accident at hyderabad | Sakshi
Sakshi News home page

Road Accident: డిగ్రీ పట్టా అందుకునేందుకు వెళ్తూ.. బీటెక్‌ విద్యార్థి మృతి

Aug 3 2024 7:33 AM | Updated on Aug 3 2024 11:26 AM

BTech student died in a road accident at hyderabad

మేడ్చల్‌రూరల్‌: నాలుగేళ్ల బీటెక్‌ విద్యను పూర్తి చేసుకుని..ఆనందంగా గ్రాడ్యుయేట్‌ పట్టా అందుకునేందుకు కళాశాలకు బయలుదేరిన విద్యారి్థని రోడ్డు ప్రమాదం బలిగొన్నది. ఈ ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు, పోలీసుల వివరాల ప్రకారం... సంగారెడ్డి ప్రాంతానికి చెందిన సాయికుమార్‌ (23), అతని స్నేహితులు వినోద్, విజయ్‌లు కండ్లకోయలోని సీఎంఆర్‌ టెక్నికల్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసుకున్నారు.

 శుక్రవారం కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమం ఏర్పాటు చేయగా డిగ్రీ పట్టాలు పొందేందుకు మిత్రులతో కలిసి సాయికుమార్‌ ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి నుంచి కళాశాలకు బయలుదేరారు. మార్గమధ్యలో గౌడవెళ్లి సమీపంలో ఓఆర్‌ఆర్‌ సరీ్వస్‌ రోడ్డులో దుండిగల్‌ వైపు నుండి సీఎంఆర్‌ కళాశాల వైపు వస్తుండగా ఓఆర్‌ఆర్‌ అండర్‌ పాస్‌ వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో మరో రోడ్డులో వెళ్తున్న లారీని ఢీ కొట్టారు.

 ప్రమాదంలో సాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా వినోద్, విజయ్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా ప్రమాదంలో మరణించిన సాయికుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement