ఎ‍ర్రవల్లి ఫాంహౌస్‌లో పల్లా రాజేశ్వర్‌కు గాయం.. యశోదకు తరలింపు | BRS MLA Palla Rajeshwar Reddy Hospitalised After Fall In Bathroom, Know About His Condition Inside | Sakshi
Sakshi News home page

ఎ‍ర్రవల్లి ఫాంహౌస్‌లో పల్లా రాజేశ్వర్‌కు గాయం.. యశోదకు తరలింపు

Jun 11 2025 9:17 AM | Updated on Jun 11 2025 10:39 AM

BRS MLA palla rajeshwar reddy hospitalised

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని బాత్‌ రూమ్‌లో కాలు జారిపోయి కింద పడిపోవడంతో రాజేశ్వర్‌ రెడ్డి కాలు విరిగినట్టు తెలుస్తోంది. దీంతో, అంబులెన్స్‌లో ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.

అయితే, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేడు కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పార్టీ నేతలు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అక్కడ బాత్‌రూమ్‌లో కాలి జారి కింద పడిపోయారు. దీంతో, ఆయన కాలు విరిగినట్టు తెలుస్తోంది. అనంతరం, అంబులెన్స్‌లో ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలిస్తున్నట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement