చాక్లెట్‌ ఆశచూపి బాలుడి కిడ్నాప్‌ | Boy kidnapped in Nizamabad GGH | Sakshi
Sakshi News home page

చాక్లెట్‌ ఆశచూపి బాలుడి కిడ్నాప్‌

Sep 6 2026 3:43 AM | Updated on Sep 6 2026 3:43 AM

Boy kidnapped in Nizamabad GGH

వేదాన్ష్, ఇద్దరు బాలురను బయటకు తీసుకెళుతున్న మహిళ , కిడ్నాప్‌ చేసిన మహిళతో పాటు ఉన్న మరో వ్యక్తి

నిజామాబాద్‌ జీజీహెచ్‌లో ఘటన

నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

నిజామాబాద్‌ అర్బన్‌: చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి మూడేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్కొండ మండలం నాగేపూర్‌ గ్రామానికి చెందిన సంధ్య, నరేశ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. సంధ్య మూడో కాన్పు కోసం ఈనెల 2న నిజామాబాద్‌లోని జీజీహెచ్‌లో చేరింది. శనివారం ఉదయం నరేశ్‌ ప్రసూతి విభాగం ముందు టీ తాగి, ఇద్దరు పిల్లలను అక్కడే ఉండమని చెప్పి ఖాళీ గ్లాసులను చెత్తకుండీలో వేసేందుకు వెళ్లాడు. అంతలోనే ఓ మహిళ పిల్లల వద్దకు వచ్చి చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి వారిని తీసుకువెళ్లింది.

మూడేళ్ల వేదాన్ష్ ఆమె వెంట వెళ్లగా.. అతడి అన్న ఐదేళ్ల నియాన్ష్ తల్లి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అక్కడికి వచ్చిన నరేశ్‌ కంగారుగా ఆస్పత్రి అంతా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆస్పత్రికి వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అపరిచిత మహిళతో పాటు మరో మగ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement