రుద్రూర్ : గురు పూజోత్సవం సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ యోగా గురువు డాక్టర్ విశ్వనాథ్ మహజన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సన్మానించారు. శనివారం సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీవో టవర్స్‌లో కార్యక్రమం నిర్వహించారు. 2026లో యోగా శిక్షణ, యోగా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు విశ్వనాథ్ మహజన్‌ను సన్మానించారు. తెలంగాణలో యోగా సర్టిఫికేషన్ బోర్డు ద్వారా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు అసిస్టెంట్ యోగా టీచర్లు, విద్యార్థులకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశ్వనాథ్ కీలకపాత్ర పోషించారు.
పెండింగ్ కేసులపై
దృష్టి సారించాలి
● ఎస్పీ రాజేశ్‌చంద్ర
దోమకొండ: పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం దోమకొండ పీఎస్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రికార్డులను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలీస్ శాఖలో సీసీటీఎన్‌సీ అప్లికేషన్ ప్రాధాన్యతను ఎస్పీ వివరించారు. పోలీస్ స్టేషన్‌న్‌లో నమోదయ్యే కేసులు, దర్యాప్తు పురోగతి, అరెస్టులు, చార్జ్‌షీట్లు, ప్రాపర్టీ, ఇతర సంబంధిత వివరాలను సీసీటీఎన్‌సీలో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని సూచించారు. డేటాఎంట్రీ, అప్‌డేటింగ్‌లో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పెట్రోలింగ్, బీట్ వ్యవస్థ బలోపేతం చేయాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల కవరేజ్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. గతంలో ప్రాపర్టీ నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అనంతరం పీఎస్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణపై తగు సూచనలు చేశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, భిక్కనూరు సీఐ నరేశ్, దోమకొండ ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు.
మొరం తరలింపుపై ఆగ్రహం
రామారెడ్డి: ఇసన్నపల్లి గ్రామంలో గంగమ్మ వాగు బ్రిడ్జి పనుల కోసమంటూ మొరాన్ని అక్రమంగా ప్రైవేటు వెంచర్లకు తరలించడంపై శని వారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సొంతంగా నిర్మించుకునే ఇళ్లకు మొరం అనుమతి ఇవ్వని రెవెన్యూ, పోలీస్ అధికారు లు అక్రమంగా వెంచర్ లోకి తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ఇసన్నపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రామారెడ్డి తహసీల్దార్‌ను ‘సాక్షి’ ఫోనులో వివరణ కోరగా స్పందించలేదు.
మద్నూర్ (జుక్కల్): మద్నూర్ మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్(మిలన్) (52) శనివారం చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజ్ఞకుమార్‌కు నాలుగు రోజుల క్రితం బీపీ ఎక్కువ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. ప్రజ్ఞకుమార్‌కు భార్య అరుణ, కొడుకు, కూతురు ఉన్నారు.


