● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు
టీ జ్యోతి విమర్శ
● బోధన్‌లో ప్రారంభమైన దివ్యాంగుల రాష్ట్రస్థాయి తరగతులు
బోధన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి విమర్శించారు. ప్రజలు పోరా డి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారుల ప్ర యోజనాలకు అనుకూలంగా మారుస్తున్నారని వి మర్శించారు. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు పట్టణంలోని ఆచన్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఓ ఫంక్షన్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అథి తిగా హాజరైన జ్యోతి మాట్లాడుతూ.. పేదల ఆదాయాన్ని పెంచుకుండా నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ఆదాయాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హా మీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లే దని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజని, ఈ చారిత్రాత్మక పోరాటాన్ని బీజేపీ హిందూ, ముస్లిముల మధ్య పోరాటంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజు లు పూర్తవుతున్నా దివ్యాంగులకు ఇచ్చిన నాలుగు హామీల్లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ది వ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య అన్నారు. పింఛన్ పెంచుతా రని వెయ్యి రోజులుగా దివ్యాంగులు ఎదురు చూస్తున్నారన్నారు. విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేదిక కేంద్ర కమిటీ సభ్యుడు జే రాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేశ్‌బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గైని రాములు, యేశాల గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత, ప్రతినిధులు నజీర్, ఉపేందర్, బాలేశ్వర్, ఆ రీఫా, బస్వరాజు, రాధమ్మ, భుజంగారెడ్డి, భాగ్యలక్ష్మి, బంగారయ్య, చెన్నయ్య, సంగప్ప పాల్గొన్నారు.


