● ప్రభుత్వ మెడలు వంచైనా
హామీలు అమలు చేయిస్తాం
● కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే
గంప గోవర్ధన్
కామారెడ్డి క్రైం: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీ లను అమలు చేయకుండా మోసం చేస్తోందని కా మారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడలు వంచైనా విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్‌ఎస్ పోరుబాటలో భాగంగా శనివారం పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ 11 వేల కోట్లు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గంప శశాంక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, రవి యాదవ్, సంగి మోహన్, లక్ష్మీనారాయణ, బల్వంత్ రావు, బీఆర్‌ఎస్ నియోజకవర్గ విద్యార్థి, యువజన విభాగం అధ్యక్షుడు భాను ప్రసాద్, ప్రతినిధులు మాజీద్, అనిల్ రెడ్డి, రంజిత్ వర్మ పాల్గొన్నారు.


