
ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్‌రావు, వీరేందర్‌గౌడ్, వేముల అశోక్
ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య, కాసం వెంకటేశ్వర్లు, శాంతికుమార్, కొల్లి మాధవి, బండ కార్తీకరెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కొలువుదీరింది. 22 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ఆదేశాలకు అనుగుణంగా ఈ కమిటీలో పదాధికారులుగా 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారి, ఒక సంయుక్త కోశాధికారి, ఒక ప్రధాన అధికార ప్రతినిధిని నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
⇒ ప్రధాన కార్యదర్శులుగా డా.ఎన్.గౌతమ్‌రావు, టి.వీరేందర్‌గౌడ్, వేముల అశోక్
⇒ ఉపాధ్యక్షులుగా డా.బూర నర్సయ్యగౌడ్, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ,, కొల్లి మాధవి, మాజీమేయర్ బండా కార్తీకరెడ్డి, డా.జె.గోపి(కల్యాణ్‌నాయక్), రఘునాథరావు
⇒ కార్యదర్శులుగా డా.ఓ.శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుబాషా, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి స్రవంతిరెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్‌రెడ్డి, డా.టి.రవికుమార్, కోశాధికారిగా దేవకి వాసుదేవ్
⇒ సంయుక్త కోశాధికారిగా విజయ్ సురానా జైన్, ప్రధాన అధికార ప్రతినిధిగా ఎనీ్వ.సుభాష్ నియమితులయ్యారు.
వివిధ మోర్చాలకు వీరే...
మహిళామోర్చా అధ్యక్షురాలిగా డా.మేకల శిల్పారెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గంథమళ్ల ఆనంద్‌గౌడ్‌ను మళ్లీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
⇒ యువమోర్చా అధ్యక్షుడిగా గణేశ్ కుందే, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బి.లక్ష్మీనరసయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నేనావత్ రవినాయక్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగన్‌మోహన్‌సింగ్‌లను నియమించారు.
రాంచందర్‌రావు టీమ్‌లో ఐదుగురే పాతవారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్‌రావు తన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా అన్ని సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేశారు. కొత్త కార్యవర్గంలో కేవలం ఐదుగురు పాతవారికే అవకాశం దక్కింది. వారిలో డా.కాసం వెంకటేశ్వర్లుయాదవ్, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ,, కొల్లి మాధవి, టి.వీరేందర్‌గౌడ్ ఉన్నారు.
అయితే అందరూ ఊహించిన విధంగా కాకుండా కొత్త వారికి ఆఫీస్ బేరర్ల లిస్ట్‌లో చోటు దొరికింది. గత రెండుమూడు కమిటీల్లో కొనసాగుతూ వచ్చిన చాలామందికి ఈసారి అవకాశం లభించలేదు. అయితే మొత్తానికి మొత్తం ముగ్గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొత్తవారినే నియమించడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమన్వయంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్రమంత్రులదే ముద్ర ?
రాష్ట్ర పదాధికారుల ఎంపికలో కేంద్ర మంత్రులు జి,కిషన్‌రెడ్డి, బండిసంజయ్ కీలకపాత్ర పోషించారని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. తమ అనుయాయులకు పెద్దపీట వేసేలా వారు పైచేయి సాధించారనే చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.
అయితే రాష్ట్ర కమిటీ కూర్పు విషయంలో ఆరుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల సిఫార్సులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బలపడేందుకు తమ అనుచరులకు రాష్ట్ర కమిటీతోపాటు జిల్లా కార్యవర్గాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలనే విజ్ఞప్తులను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోలేదనే వారు వాపోతున్నారు.