అలరించిన భక్త ప్రహ్లాద పద్యనాటకం | The Bhakta Prahlada Verse Play Captivates the Audience | Sakshi
Sakshi News home page

అలరించిన భక్త ప్రహ్లాద పద్యనాటకం

Mar 20 2026 9:15 AM | Updated on Mar 20 2026 9:43 AM

The Bhakta Prahlada Verse Play Captivates the Audience

హైదరాబాద్ : ఉగాది సందర్భంగా ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌లో ఆవరణలో ఉన్న రామానాయుడు కళామండపంలో ఉగాది పౌరాణిక పద్యనాటకోత్సవాలు నిర్వాహకులు పొత్తూరి వెంకట సుబ్బారావు గురువారం ప్రారంభించారు.పద్య నాటకోత్సవాల్లో భాగంగా తొలి రోజు రంగ స్థల కళాకారులు భక్త ప్రహ్లాద భక్తి రస ప్రధాన పద్యనాటకాన్ని రక్తి కట్టించారు.

జగాది విజయసాయి దర్శకత్వం వహిచంగా మీగడ రామలింగ స్వామి ఈ నాటికను రచించారు. ప్రహ్లాదుడుగా చిరంజీవి జాహ్నవి లక్ష్మి, హిరణ్యకశ్యపగా బగాది విజయ సారధి, దేవేంద్రుడిగా బిర్లంగి ప్రసాద్, నారదుడుగా బగాది విజయసాయి, తామ్రక్షుడిగా డేవిడ్‌రాజు, దూమ్రాక్షుడిగా తమ్మినేని దాలినాయుడు, చండగా మైలిపల్లి చంద్రరావు, అమార్కుగా ఓలేటి శంకర్, సింగిగా కుమారి, లీలావతిగా సంధ్యా ప్రియదర్శిని, శ్రీ మహావిష్ణువుగా సురేంద్ర నాయుడు, వీరాక్షుడుగా బీఎస్‌.రెడ్డి, ఘోరాక్షుడిగా పైడిరాజు, ఋషులుగా పులి శివ ప్రకాశ్, ఎల్‌. జోగారావు నటించారున. నేటి తరానికి రంగ స్థల కళలను పరిచయం చేసేందుకు ఈ నాటికలను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు పొత్తూరి వేంకట సుబ్బారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement