ఆహార కల్తీని అరికడదాం | - | Sakshi
Sakshi News home page

ఆహార కల్తీని అరికడదాం

Mar 20 2026 9:22 AM | Updated on Mar 20 2026 9:22 AM

87126 61212కు ఫోన్‌ చేయండి

అబిడ్స్‌: నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్‌ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో (హెచ్‌–ఫాస్ట్‌) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గురువారం న్యూ ఉస్మాన్‌గంజ్‌ రోడ్డులోని పాత బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌ భవనంలో ఈ టీమ్‌ కార్యాలయాన్ని ఐపీఎస్‌ అధికారి గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ ప్రారంభోత్సవం చేశారు. జంట నగరాల్లో ఆహార కల్తీని నిరోధించేందుకు కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ నేతృత్వంలో, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సమన్వయంతో హెచ్‌–ఫాస్ట్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆహార కల్తీకి పాల్పడితే 87126 61212కు ఫిర్యాదు చేయవచ్చు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు రంజిత్‌కుమార్‌ గౌడ్‌, అంజయ్య, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు రమ్య, అభిలాష్‌, అఖిల్‌, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement