ఆర్‌జీఐఏ సిబ్బంది ఉత్తమ సేవలకు మరోసారి అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌జీఐఏ సిబ్బంది ఉత్తమ సేవలకు మరోసారి అవార్డు

Mar 20 2026 9:22 AM | Updated on Mar 20 2026 9:22 AM

శంషాబాద్‌: విమానాశ్రయంలో సిబ్బంది అందించే ఉత్తమ సేవలకు గాను ఆర్‌జీఐఏ మరోసారి అవార్డును దక్కించుకుంది. ‘స్కైట్రాక్‌’ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల ద్వారా చెక్‌ ఇన్‌, భద్రత, ఇమిగ్రేషన్‌ తదితర అంశాల్లో ప్రయాణికుల అనుభవాన్ని క్రోడీకరించి ఈ అవార్డును అందజేస్తారు. ఈ మేరకు 2026 ‘బెస్ట్‌ ఎయిర్‌పోర్టు స్టాఫ్‌ ఇన్‌ ఇండియా, సౌత్‌ ఏషియా ’ అవార్డును లండన్‌లో నిర్వహించిన ప్యాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌పోలో అందజేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆర్‌జీఐఏ ప్రయాణంలో ఈ అవార్డును అందుకోవడం ఐదోసారి అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement