ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చర్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు | Grand Ugadi Celebrations at the MP And MLA Colony | Sakshi
Sakshi News home page

ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చర్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు

Mar 20 2026 7:29 AM | Updated on Mar 20 2026 8:46 AM

Grand Ugadi Celebrations at the MP And MLA Colony

హైదరాబాద్ : ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్, విజయ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సంయుక్తంగా ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు పెద్ది రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాగిడి లక్ష్మా రెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ కొలను హనుమంత రెడ్డి, సెక్రటరీ సందీప్ రెడ్డి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఉగాది పంచాంగ శ్రవణం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పరంపర కళాకారులు ప్రదర్శించిన మహాకాళి నృత్యం ఆద్యంతం కట్టి పడేసింది. దీంతో పాటు నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమం వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో  క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, ప్రముఖ సామాజికవేత్త శిల్పా రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సంప్రదాయ పిండి వంటల తో విందును ముగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement