వచ్చే నెల 19నే వినాయక చవితి: భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి | Bhagyanagar Ganesh Utsav Samithi Key Comments On Vinayaka Chavithi Festival 2023 - Sakshi
Sakshi News home page

When Is Ganesh Chaturthi In 2023: వినాయక చవితిపై భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి కీలక ప్రకటన

Published Mon, Aug 28 2023 3:47 PM

Bhagyanagar Ganesh Utsav Samithi Key Comments On Vinayaka Chavithi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్‌  ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత పండుగ నిర్వహించుకోవాలని సూచించింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. 

కాగా, భాగ్యనగర్‌ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం భేటీ అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, వచ్చే నెల18వ తేదీన మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తాం. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత జరుపుతున్నాం. వచ్చే నెల 28వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. 

పొలిటికల్‌ ఫ్లెక్సీలు వద్దు..
గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గణేష్ పూజా విధానం తెలిపే బుక్‌తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించాం. గణేష్‌ మండపాలకు పోలీసు పర్మిషన్‌ తప్పనిసరి కాదు. స్థానిక పోలీసు స్టేషన్‌లో చెబితే సరిపోతుంది. గణేష్‌ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించింది. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు చెప్పాం. గణేష్‌ ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌ రావాలని అడిగినట్టు తెలిపారు. 

పండుగ ఘనంగా నిర్వహిస్తాం..
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా గణేష్‌ ఉత్సవాలు జరుగుతాయి. 30వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించాం. గణేష్‌ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుగుతోంది. వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తాం. 

వినాయక నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబి ఒకేరోజు వస్తున్నాయి. ఆరోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తాం. మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించింది. గణేష్‌ మండపాల పర్మిషన్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం’ అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..

Advertisement
 
Advertisement
 
Advertisement