రోడ్డు ప్రమాద నిందితులకు బెయిల్‌  | Bail Granted Banjara Hills Road Accident Accused | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాద నిందితులకు బెయిల్‌ 

Jan 10 2022 4:54 AM | Updated on Jan 10 2022 8:24 AM

Bail Granted Banjara Hills Road Accident Accused - Sakshi

బంజారాహిల్స్‌: మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరి మృతికి కారకులైన ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గత నెల 6న తెల్లవారుజామున బజార్‌ రోహిత్‌గౌడ్, సాయిసోమన్, కోసరాజు వెంకటేష్‌లు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో మద్యం తాగి ఆ మత్తులో కారులో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 3లోని రెయిన్‌బో ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు ఆస్పత్రి ఉద్యోగులను కారుతో ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

అదే రోజు ప్రమాదానికి కారణమైన రోహిత్‌గౌడ్, సాయి సోమన్‌లపై ఐపీసీ సెక్షన్‌ 304(2) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో మరో నిందితుడు కోసరాజు వెంకటేష్‌ పరారయ్యాడు. అతనిపై ఐపీసీ సెక్షన్‌ 304(2) కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నిందితుడు పోలీసులకు దొరక్కుండా కోర్టులో లొంగిపోయాడు. ముగ్గురికీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం ముగ్గురూ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరై సంతకాలు చేయాలని షరతు విధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement