బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య | B Tech Student Commits Suicide: Hyderabad | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Sep 28 2024 4:23 AM | Updated on Sep 28 2024 4:23 AM

B Tech Student Commits Suicide: Hyderabad

పటాన్‌చెరు టౌన్‌: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ çఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని అనంతపురంలో విద్యుత్‌ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న నాగరాజు రెండో కూతురు వర్ష (19) పటాన్‌చెరు మండలంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చదువుతోంది.

అక్కడే బాలికల హాస్టల్‌లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తన గదిలోకి వెళ్లి బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత తోటి విద్యార్థినులు తలుపు కొట్టినా తీయకపోవడంతో వాచ్‌మన్‌ వచ్చి తలుపు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా.. వర్ష ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించింది. 

Advertisement
 
Advertisement
Advertisement