అన్నం పెట్టి...ఆశ్రయం ఇచ్చి.. | assault case in Banjara Hills | Sakshi
Sakshi News home page

అన్నం పెట్టి...ఆశ్రయం ఇచ్చి..

Jun 9 2025 9:04 AM | Updated on Jun 9 2025 9:07 AM

assault case in Banjara Hills

యువతిపై లైంగికదాడికి యత్నం  

నిందితుడి అరెస్ట్‌   

బంజారాహిల్స్‌: రోడ్డు పక్కన ఒంటరిగా  నిలబడిని యువతిని  లిప్ట్‌ ఇస్తానని బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని  బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన యువతి(22) ఇష్టంలేని పెళ్లి చేస్తుడటంతో ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్‌ చేరుకుని. 

శనివారం రాత్రి  ఆమె జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి సమీపంలో ఒంటరిగా నిలుచుని ఉండగా అదే సమయంలో బైక్‌పై వస్తున్న మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి అమెను మాటల్లో పెట్టి ఆశ్రయమిస్తానని చెప్పి కమలాపురికాలనీలోని తన గదికి తీసుకెళ్లాడు. ఆమెకు అన్నం పెట్టి ఆకలితీర్చాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి యతి్నంచగా ఆమె కేకలు వేసింది. దీంతో పక్కప్లాట్‌లో నివసిస్తున్న వ్యక్తి అక్కడికి వచ్చి ఆరా తీయగా ఆమె జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మల్లికార్జునరెడ్డి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తికాగా, ఓ కొరియోగ్రాఫర్‌ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసుల సమాచారంతో నగరానికి చేరుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లారు. బంజాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement