అక్బరుద్దీన్‌ ఒవైసీ మెజారిటీపై సర్వత్రా ఆసక్తి | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్‌ ఒవైసీ మెజారిటీపై సర్వత్రా ఆసక్తి

Published Sun, Dec 3 2023 7:36 AM

Akbaruddin Owaisi is all interested in majority - Sakshi

చాంద్రాయణగుట్ట: వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు ఆరోసారి బరిలోకి దిగిన చాంద్రాయణగుట్ట ఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ ఎంత మెజార్టీతో గెలుస్తారన్న విషయం ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. గత ఎన్నికల సమయంలో అక్బరుద్దీన్‌ ఒవైసీ 95,339 ఓట్లు రాబట్టి బీజేపీ అభ్యర్థి సయ్యద్‌ షహజాదిపై 80,264 ఓట్ల మెజార్టీ సాధించారు.

ద్వితీయ స్థానంలో సయ్యద్‌ షహజాదీ 15,075, తర్వాతి స్థానాలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డి 14,224, కాంగ్రెస్‌ అభ్యర్థి ఇసా బిన్‌ ఒబేద్‌ మిశ్రీ 11,309ల ఓట్లు మాత్రమే రాబట్ట గలిగారు. గతంతో పోలిస్తే ఈసారి 12 వేల ఓట్లు అధికంగా పోలవ్వడం.. ప్రధాన పారీ్టల అభ్యర్థులు హిందువులు కావడంతో ముస్లిం ఓట్లు తమకు గంపగుత్తగా పడి లక్ష మెజార్టీ వస్తుందని మజ్లిస్‌ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. వారి అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయన్నది ఆదివారం వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. 

Advertisement

తప్పక చదవండి

Advertisement