ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూమోహన్‌ | Actor Babu Mohan Joins in KA Paul Praja Shanthi Party | Sakshi
Sakshi News home page

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూమోహన్‌

Mar 4 2024 3:17 PM | Updated on Mar 4 2024 3:51 PM

Actor Babu Mohan Joins in KA Paul Praja Shanthi Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏపాల్‌ సమక్షంలో సోమవారం ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు బాబూమోహన్‌.

కాగా ఇటీవలే బాబూ మోహన్‌ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని ఆ సయంలోనే బాబూ మోహన్‌ వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబూ మోహన్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలపొందారు. బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు.
చదవండి: నా జీవితం దేశానికి అంకితం: ప్రధాని మోదీ

Advertisement
 
Advertisement
Advertisement