ఒకేసారి 573 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్ల బదిలీ | 573 constables reallocated to strengthen Hyderabad Police | Sakshi
Sakshi News home page

ఒకేసారి 573 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్ల బదిలీ

Jan 20 2025 10:39 AM | Updated on Jan 20 2025 11:32 AM

573 constables reallocated to strengthen Hyderabad Police

సాక్షి,హైదరాబా: హైదరాబాద్‌ సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో పని చేస్తున్న 573 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లు ఒకేసారి బదిలీ అయ్యారు. ఇందులో పురుషులు 350 కాగా.. మహిళా కానిస్టేబుళ్లు 223 మంది. వీరందరినీ సిటీలోని లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లతో పాటు స్పెషల్‌ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, హెచ్‌–న్యూ, సైబర్‌ క్రైమ్‌ విభాగాలకు అటాచ్‌ చేస్తూ నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కమిషనరేట్‌ పరిధిలోని శాంతి భద్రతలు, ఇతర విభాగాల పనితీరును మరింత మెరుగవుతుందని ఆనంద్‌ తెలిపారు. 

ఈమేరకు ఆదివారం బదిలీ సిబ్బందితో బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. సహనంతో, వివిధ వర్గాల ప్రజల మధ్య పని చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇది కేవలం అటాచ్‌మెంట్‌ మాత్రమేనని వారికి సీనియారిటీ లేదా విభాగం మార్పిడి హక్కులు ఉండవని, పోలీసు స్టేషన్‌లలో పెట్రోలింగ్, ప్రాథమిక విధులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న సివిల్‌ పోలీసుల కొరతను అధిగమించడానికి అటాచ్‌మెంట్‌ చేస్తున్నామని వివరించారు. 

క్షేత్రస్థాయిలో పని చేస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న సమాచారం వచి్చనా, సంఘటన చూసినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమములో అదనపు సీపీ లా అండ్‌ ఆర్డర్‌ విక్రమ్‌ సింగ్‌ మాన్, జాయింట్‌ సీపీ అడ్మిన్‌ పరిమళ హనా నూతన్, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ డీసీపీ రక్షితా కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement