Headquarters
-
కెంటకీకి కేఎఫ్‌సీ గుడ్‌బై
కెంటకీ ఫ్రైడ్ చికెన్. క్లుప్తంగా కేఎఫ్‌సీ. పరిచయమే అక్కర్లేని ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్. ఈ ఫుడ్ జాయింట్ దిగ్గజానికి పిల్లల నుంచి పండు ముసలి దాకా లెక్కలేనంత మంది అభిమానులు! అమెరికాకు చెందిన ఈ బ్రాండ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇంతకాలం తన కేరాఫ్‌గా నిలిచిన కెంటకీలోని లూయిస్విల్లే నుంచి టెక్సాస్‌లోని ప్లానోకు ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తోంది. కొన్ని కార్యకలాపాలు మాత్రం కెంటకీ నుంచి ఇకముందూ కొనసాగుతాయని యాజమాన్యం ప్రకటించింది. కేఎఫ్‌సీ నిర్ణయంపై కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషెర్ విచారం వెలిబుచ్చారు. ఈ విషయం తెలిస్తే బహుశా ఆ సంస్థ వ్యవస్థాపకుడు కల్నల్ హార్లండ్ శాండర్స్ కూడా బాధపడి ఉండేవాడన్నారు. ‘‘ఆ కంపెనీ పేరే మా రాష్ట్రంతో మొదలవుతుంది. తన ఉత్పత్తుల విక్రయానికి మా రాష్ట్ర సంస్కృతిని, వారసత్వాన్ని ఉపయోగించుకుంది’’అని చెప్పు కొచ్చారు. పరిశ్రమలు, సంస్థలపై పన్నుల భారాన్ని టెక్సాస్ కొన్నే ళ్లుగా బాగా తగ్గించింది. దాంతో పాటు అక్కడి వ్యాపార అనుకూల వాతావరణానికి అమె రికన్ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్ర బాట పడుతున్నాయి. కేఎఫ్‌సీని 1930ల్లో కెంటకీలోని కోర్బిన్లో ఓ సరీ్వస్ స్టేషన్ దగ్గర ఫ్రైడ్ చికెన్ చిన్న దుకాణంగా శాండర్స్ మొదలు పెట్టారు. దాని రుచికి జనాలు ఫిదా కావడంతో చూస్తుండగానే యమా పాపులరైంది. ఇప్పుడు 145కు పైగా దేశాల్లో సంస్థకు ఏకంగా 24 వేల పై చిలుకు ఔట్‌లెట్లున్నాయి! ప్రతి కేఎఫ్‌సీ షాపు ముందూ కన్పించే గమ్మత్తైన ఫేసు దాని వ్యవస్థాపకుడు శాండర్స్దే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమరావతికి ఏపీఈఆర్సీ
-
ఒకేసారి 573 మంది ఏఆర్ కానిస్టేబుళ్ల బదిలీ
సాక్షి,హైదరాబా: హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పని చేస్తున్న 573 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు ఒకేసారి బదిలీ అయ్యారు. ఇందులో పురుషులు 350 కాగా.. మహిళా కానిస్టేబుళ్లు 223 మంది. వీరందరినీ సిటీలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లతో పాటు స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, హెచ్–న్యూ, సైబర్ క్రైమ్ విభాగాలకు అటాచ్ చేస్తూ నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కమిషనరేట్ పరిధిలోని శాంతి భద్రతలు, ఇతర విభాగాల పనితీరును మరింత మెరుగవుతుందని ఆనంద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం బదిలీ సిబ్బందితో బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సహనంతో, వివిధ వర్గాల ప్రజల మధ్య పని చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇది కేవలం అటాచ్మెంట్ మాత్రమేనని వారికి సీనియారిటీ లేదా విభాగం మార్పిడి హక్కులు ఉండవని, పోలీసు స్టేషన్లలో పెట్రోలింగ్, ప్రాథమిక విధులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న సివిల్ పోలీసుల కొరతను అధిగమించడానికి అటాచ్మెంట్ చేస్తున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న సమాచారం వచి్చనా, సంఘటన చూసినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమములో అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ అడ్మిన్ పరిమళ హనా నూతన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితా కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో ఏఐసీసీ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభం
-
New Delhi: కాంగ్రెస్‌కు కొత్త కార్యాలయం.. నేడు ప్రారంభించనున్న సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చిరునామా మారింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేడు (జనవరి 15) పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్'ను ప్రారంభించనున్నారు. గత ఐదు దశాబ్దాలుగా పార్టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం పేరు ‘ఇందిరా భవన్’.. ఇది 9-ఎ కోట్ల రోడ్డులో ఏర్పాటయ్యింది. నేటి ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. VIDEO | Delhi: Congress MP Priyanka Gandhi (@priyankagandhi) leaves after inspecting Congress' new headquarters - Indira Gandhi Bhawan - in Delhi, ahead of its inauguration on Wednesday. (Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC)#Delhi pic.twitter.com/TLp1zjg7Nf— Press Trust of India (@PTI_News) January 14, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ నూతన కార్యాలయ నిర్మాణం ప్రియాంక గాంధీ సారధ్యంలో కొనసాగింది. కార్యాలయ మ్యాప్‌ను ఖరారు చేయడం మొదలుకొని పెయింటింగ్, చిత్రాలు, కర్టెన్లు, ఫర్నిచర్ వరకు ప్రియాంక స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించారు. ఈ కొత్త కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు పాత ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్ మంగళవారం ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు.. ‘2025, జనవరి 15న ఉదయం 10 గంటలకు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కొత్త ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా గాంధీ గాంధీ భవన్’ను ప్రారంభించనున్నారు’ అని తెలిపారు.It is time for us to move ahead with the times and embrace the new!On 15 January, 2025 at 10am, in the esteemed presence of INC President Sh. Mallikarjun @kharge ji and LOP Sh. @RahulGandhi ji, Hon’ble CPP Chairperson Smt. Sonia Gandhi ji will inaugurate the new AICC…— K C Venugopal (@kcvenugopalmp) January 7, 2025కాంగ్రెస్ నూతన కేంద్ర కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’ పార్టీలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, పరిపాలనా, సంస్థాగత, వ్యూహాత్మక విధుల నిర్వహణకు అనువుగా ఆధునిక సౌకర్యాలతో రూపొందింది. 1978లో కాంగ్రెస్(ఐ) ఏర్పడినప్పటి నుండి పార్టీ ప్రధాన కార్యాలయం '24, అక్బర్ రోడ్'లో ఉంది. -
అమెజాన్ బెంగళూరు హెడ్‌క్వార్టర్స్ తరలింపు
ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా బెంగళూరులోని తన కార్పోరేట్ ప్రధాన కార్యాలయాన్ని వేరొక చేటుకు తరలిస్తోంది. చాలా కాలంగా ఉంటున్న బెంగళూరు వాయువ్య ప్రాంతం నుండి నగరంలోని విమానాశ్రయానికి సమీపంలోకి మారుస్తోది. నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో భాగంగా హెడ్‌క్వార్టర్స్ తరలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.అమెజాన్ ఇండియా తన కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రస్తుతం మల్లేశ్వరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలోని 30-అంతస్తుల భవనంలో 18 అంతస్తులలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఖాళీ చేస్తుండటంతో అంత భారీ విస్తీర్ణాన్ని కొత్తగా అద్దెకు తీసుకునే సంస్థ దొరకడం కష్టమే.అమెజాన్ ఇండియా కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ కోసం డబ్ల్యూటీసీలో చదరపు అడుగుకు రూ.250 చొప్పున చెల్లిస్తుండగా కొత్త భవనంలో అద్దె ఇందులో మూడింట ఒక వంతు కంటే తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఆదా అవుతుందని అంచనా. తరలింపు ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై 2026 ఏప్రిల్‌లో ముగుస్తుంది.🚨 Amazon India is moving its headquarters from WTC building in Bengaluru near to the city's airport to save costs. pic.twitter.com/WItCV9suYP— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2024 -
Israel-Hezbollah war: బంకర్ బస్టర్ బాంబు వినియోగం
బీరుట్: హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడిలో ‘బంకర్ బస్టర్’ బాంబును వాడినట్లు రక్షణ రంగ నిపుణుడు ఎలిజా మాగి్నయర్ చెప్పారు. అత్యంత ఆధునాతన జీబీయూ–72 రకం బాంబును ఇజ్రాయెల్ వాడింది. దీనిని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘‘2021లో రూపొందించిన ఈ బాంబు బరువు ఏకంగా 2,200 కేజీలు. దాడి చేసిన చోట ఎవ్వరూ ప్రాణాలతో బయటపడకూడదనే గట్టి నిశ్చయంతో ఇజ్రాయెల్ ఈ బాంబు వేసినట్లు స్పష్టమవుతోంది. జార విడిచిన వెంటనే భవనం అండర్‌గ్రౌండ్‌లోకి దూసుకుపోవడం, ఆ మొత్తం భవనం నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఇక్కడ ఏకకాలంలో ఇలాంటి బాంబుల్ని ఇంకొన్ని జారవిడిచినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది. భారీ భవనాలను క్షణాల్లో శిథిలాల కుప్పగా మార్చే సత్తా వీటి సొంతం’’ అని ఎలిజా వ్యాఖ్యానించారు. శుక్రవారం లెబనాన్‌లో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా ఈవారంలో మరణాల సంఖ్య 720 దాటింది. -
నూతన ఓటీటీ హిమాన్షు..
సాక్షి, సిటీబ్యూరో: నగర వేదికగా ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాతో పాటు హిమాన్షు గ్రూప్ ఎండీ సంజీవ్ పూరి ప్రారంభించారు. ఈ వేదికగా ప్రకటనలకు సంబంధించిన షూట్లు, భారీ–బడ్జెట్ సినిమా నిర్మాణాలు, దర్శకత్వం ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు సంస్థ కేంద్రంగా పనిచేయనుంది. భారీ సినిమాలకు, పలు వినోద కార్యక్రమాలకు వేదికైన హైదరాబాద్ కేంద్రంగా.. పరిశ్రమలో అధునాతన సౌకర్యాలతో మరిన్ని సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకులు హిమాన్షు దేవ్కేట్ తెలిపారు. హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్, నెట్ ఫ్లిక్స్ సహా పలు వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో, స్టార్హీరోలతో నిర్మిస్తున్న తెలుగు సినిమాల్లో పని చేస్తోందని వివరించారు. -
నన్ను పోలీస్ లాకప్‌కు పంపొద్దు
న్యూఢిల్లీ: ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి తనను పోలీస్ లాకప్‌కు తరలించకుండా అడ్డుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ కోర్టును కోరారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో శనివారం ఈ మేరకు పిటిషన్ వేశారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఆయనను బుధవారం అరెస్టు చేయడం తెలిసిందే. కోర్టు ఆయనకు ఈనెల 10 దాకా రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయంలోని లాకప్ రూంలో ఉంచారు. అక్కడ పురుగు మందులు కొడుతున్నారనే నెపంతో తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయతి్నంచారని సంజయ్‌సింగ్ ఆరోపించారు. తనను టార్చర్ చేసేందుకు కుట్ర పన్నారన్నారు. తరలింపు ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అమానవీయంగా వ్యవహరించారన్నారు. -
యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌లో కవర్ కలకలం..! భయంతో వణికిపోయిన ఉద్యోగులు..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ 2017లో కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌ను కాలిఫోర్నియాలో యాపిల్ పార్క్ పేరిట ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పార్క్ సుమారు 64 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోవిడ్-19 రాకతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు పరిమితమయ్యారు. కరోనా ఉదృత్తి తగ్గడంతో తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్ధమైంది. అయితే తాజాగా యాపిల్ పార్క్ క్యాంపస్ లోపల ఒక చిన్న కవర్ కలకలం సృష్టించింది. దెబ్బకు ఖాళీ..! యాపిల్ పార్క్ క్యాంపస్ లోపల తెల్లటి పొడి పదార్థంతో కూడిన ఒక ఎన్వలప్ కవర్‌ను యాపిల్ సిబ్బంది గుర్తించారు. దీంతో ఉద్యోగులు హైరనా పడిపోయారు.కవర్లో ఎదో ఉందనే భయంతో ఉద్యోగులను పార్క్ నుంచి పాక్షికంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈ విషయాన్ని లోకల్ శాంటా క్లారా కౌంటీ ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. అయితే ఎన్వలప్లో ప్రమాదకరమైనది ఏమీ లేదని వారు కనుగొన్నారు. దీంతో ఉద్యోగులంతా ఊపిరిపిల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో ఉద్యోగులను తిరిగి ప్రాంగణంలోకి అనుమతించారు. అయితే ఆ పౌడర్ ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. ది వెర్జ్ ప్రకారం..కవరు లోపల "ప్రమాదకరమైన పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారని యాపిల్ ఉద్యోగులకు తెలిపింది. యాపిల్ పార్క్‌లో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని, అన్ని విభాగాలు తెరిచి ఉన్నాయని ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. ఇక ఏప్రిల్ 11న ప్రారంభమయ్యే కొత్త హైబ్రిడ్ మోడల్ లో ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి తీసుకురావడం ప్రారంభిస్తామని యాపిల్ ఇటీవల ప్రకటించింది. మెల్లమెల్లగా ఉద్యోగులను పూర్తిగా ఆఫీసులకు పిలచే యోచనలో యాపిల్ ఉన్నట్లు సమాచారం. చదవండి: ఒక్కరోజే డెడ్‌లైన్..! ఇది దాటితే కొత్త ధరలే..! షాక్ ఇచ్చేందుకు సిద్దమైన ఓలా..! -
Tesla: అనూహ్య నిర్ణయంతో షాకిచ్చిన టెస్లా
ఈవీ దిగ్గజ కంపెనీ టెస్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. కంపెనీ హెడ్ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్‌కు భారీ షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన షేర్‌హోల్డర్స్ వార్షికోత్సవం సమావేశంలో ఊహించని ఈ ప్రకటన చేశాడు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న టెస్లా.. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ నుంచే ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. అయితే ఉన్నపళంగా ఎందుకు తరలిస్తున్నారనే విషయం కాసేపు హైడ్రామా నడిపించిన మస్క్.. విస్తరణలో భాగంగానే ఈ తరలింపు చేపట్టినట్లు చెప్పారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు టెస్లా హెడ్ క్వార్టర్స్‌ను తరలించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత కాలపరిమితిలో చేస్తామనే విషయంపై మాత్రం మస్క్ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం చిప్, ఇతరత్ర కంపోనెంట్ల కొరత సమస్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. పాలో ఆల్టోలో ఉన్న హెడ్ క్వార్టర్స్ కేంద్రం టెస్లా సేల్స్ ఆశాజనకంగానే సాగుతున్నట్లు సమావేశంలో మస్క్ వెల్లడించాడు. అయితే ఫ్రెమోంట్ ప్లాంట్ నుంచి వాహనాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పరిమితుల కారణంగా అది జరగలేకపోతుందని ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక హెడ్‌క్వార్టర్స్ తరలింపు గురించి రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఉన్న చట్టాల వల్ల మస్క్ ఇబ్బందులు పడుతున్నాడని, అందుకే తరలింపునకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు తక్కువ ఇన్కమ్ ట్యాక్స్‌లు, తక్కువ రెగ్యులేషన్స్ ఉన్న ప్రాంతాలకు తరలిపోయే అంశం గురించి మస్క్ సహా పలువురు టెక్ దిగ్గజాలు చాలాకాలంగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలో ఆల్టోకు 2400 కిలోమీటర్ల దూరంలోని ఆస్టిన్‌కు హెడ్ క్వార్టర్స్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో ఎలాంటి కుదేలుకు లోనవుతుందో చూడాలి మరి!. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు.. మూల్యం -
ప్రారంభోత్సవానికి సిద్ధం!
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఉద్ఘాటనకు రావాలని సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీని కలిసి కోరిన నేపథ్యంలో పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈనెల 20 తేదీ వరకు తుది దశ పనుల పర్యవేక్షణకు యాదాద్రికి మరోసారి రానున్నారు. మహా సుదర్శనయాగం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను సీఎం పర్యవేక్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ముందు శాస్త్రోక్త కార్యక్రమాలకు సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. నూతన ఆలయంలో స్వయంభూ శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి దర్శనం భక్తులకు కల్పించే ముందు శాస్త్రోక్తంగా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల దిశానిర్దేశం కోసం దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఉప ప్రధానాచార్యులు త్రిదండి చినజీయర్‌స్వామిని కలిశారు. ఆయన పనుల ఒత్తిడిలో ఉండటంతో రెండు రోజుల తర్వాత మరోసారి రావాలని కోరారు. దీంతో మరోసారి జీయర్ స్వామిని కలిసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవం: ఆకట్టుకున్న యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విశాఖ తీరంలో యుద్ధ నౌకల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలు ప్రత్యేక అలంకరణలో కనిపించాయి. -
లండన్‌లో టిక్‌టాక్ కార్యాలయం?
న్యూఢిల్లీ: యువతను విశేషంగా ఆకర్శించిన చైనాకు చెందిన టిక్‌టాక్ తాజాగా భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. సరిహద్దు వివాదాలే కాకుండా, వూహాన్లో ఉద్భవించిన కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చైనాపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ యాజమాన్యం చైనా బ్రాండ్‌ను తగ్గించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే టిక్‌టాక్ కేంద్ర కార్యాలయాన్ని లండన్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే భారత్‌లాగే అమెరికాకు కూడా చైనాతో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రెండు కీలక దేశాలు టిక్‌టాక్‌ను నిషేదించడంతో సంస్థ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. అయితే టిక్‌టాక్‌ను యూకేలో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసే విషయంలో కీలక ముందడుగు పడినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. -
యూట్యూబ్ కార్యాలయం వద్ద కాల్పులు
వాషింగ్టన్: యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం నజాఫి అఘ్డం (39) అనే మహిళ జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉద్యోగులు గాయపడ్డారు. ఆ తర్వాత తోపులాట చోటుచేసుకుని మరొకరికి గాయమైంది. అనంతరం ఆమె తనను తానే కాల్చుకుని చనిపోయింది. యూట్యూబ్ అనుసరిస్తున్న విధానాలపై నజాఫి అసంతృప్తిగా ఉండేదనీ, యూట్యూబ్ విధానాల వల్ల తన వీడియోలకు డబ్బులు రావడం లేదని ఆమె ఎప్పుడూ బాధపడుతుండేదని పోలీసులు చెప్పారు. ఈ కారణంగానే ఆమె యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చి కాల్పులు జరిపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యూట్యూబ్ విధానాలతో తన కూతురు అసంతృప్తిగా, కోపంగా ఉందనీ, ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని కూడా అనుకుంటోందనీ ఆమె తండ్రి ఇంతకుముందే పోలీసులు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. నలుగురు ఉద్యోగులు గాయపడటం బాధాకరమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. -
అమెజాన్ కీలక నిర్ణయం: 20 సెంటర్లు, భారీ ఉద్యోగాలు
వాషింగ్టన్: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున విస్తరించేందుకు రచిస్తున్న ప్రణాళికల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా తాను ఏర్పాటు చేయనున్న కొత్త కార్యాలయాల జాబితాను వెల్లడించింది. అమెరికా ప్రధాన మెట్రో నగరాలు న్యూ యార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీతో పాటు ముఖ్యంగా నార్త్ కరోలినా, కొలంబస్, ఒహియో లాంటి చిన్న నగరాల్లో కూడా అమెజాన్ సెకండ్ హెడ్ క్వార్టర్స్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కెనడాలోని ఓ ప్రధాన నగరం సహా 20 ముఖ్య నగరాల్లో అమెజాన్ కార్యాలయాలను ప్రారంభించనుంది. 238 ప్రతిపాదనలను సమీక్షించిన తర్వాత అమెజాన్ ఎంపిక చేసిన నగరాల జాబితాను గురువారం విడుదల చేసింది. 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులతో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామనీ, తద్వారా సుమారు 50వేల ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని అమెజాన్ ప్రకటించింది అమెరికా, కెనడా, మెక్సికో దేశాల నుంచి 238 సెంటర్లను పరిశీలించిన అమెజాన్ చివరికి ఈ ఎంపిక చేసింది. టెక్నాలజీ హబ్‌గా ఎస్టాబ్లిష్ అయిన బోస్టన్, పిట్స్బర్గ్ సహా కొలంబియా, ఓహియా నగరాలు ఈ జాబితాలో ఉండటం విశేషం. అమెరికా బయట కెనడా అతిపెద్ద నగరం టొరాంటో ఈ జాబితాలో ఉంది. -
మంథని సీఐపై వేటు
⇒ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసిన సీపీ దుగ్గల్ ⇒ మధు మృతదేహానికి 7న రీ పోస్టుమార్టం ⇒ పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు ⇒ హోంమంత్రిని కలసిన మృతుడి తల్లిదండ్రులు ⇒ హైకోర్టు జడ్జి సమక్షంలో పోస్టుమార్టంకు వినతి ⇒ నేడు హైకోర్టులో రిట్ పిటిషన్ సాక్షి, పెద్దపల్లి: ప్రేమ వ్యవహారం కారణంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ శివారులో అనుమానాస్పదంగా శవమై కనిపించిన మధుకర్ సంఘటన మరో కీలక మలుపు తిరిగింది. ఏకంగా రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ రంగంలోకి దిగారు. మంగళవారం మధుకర్ స్వగ్రామమైన ఖానాపూర్‌ను సందర్శించి, అతడి తల్లిదండ్రులతో మాట్లాడారు. మధుకర్ మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 10 గంటల్లోపే మంథని సీఐపై వేటు వేశారు. సీఐని హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు సీఐ ప్రయత్నిస్తున్నారంటూ మధుకర్ తల్లిదండ్రుల ఆరోపణల మేరకు సీఐని హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేశామని దుగ్గల్ ప్రకటించారు. అయినా అంతర్గతంగా ఏదో జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది. గోదావరిఖని డివిజన్ పోలీసులతో సంబంధం లేకుండా మధుకర్ మృతిపై పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మతో ప్రత్యేకంగా దర్యాప్తు చేయిస్తున్నా.. మంథని సీఐని వీఆర్‌లో పెట్టడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల అదుపులో ఆరుగురు మంథని సీఐ ప్రభాకర్ స్థానంలో నటేష్గౌడ్కు బుధవారం పోస్టింగ్ ఇచ్చారు. ఈయన బాధ్యతలు చేపట్టిన వెంటనే మధుకర్ స్వగ్రామం ఖానాపూర్ వెళ్లి, మధుకర్ తల్లిదండ్రులు అనుమానిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని పెద్దపల్లికి తరలించి డీసీపీ విజేందర్‌రెడ్డి సమక్షంలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. వీరిలో సర్పంచ్‌తో పాటు ఆయన కుమారుడు ఉన్నట్టు సమాచారం. ఈ ఆరుగురు కూడా మధుకర్ ప్రేమించిన యువతి బంధువులేనని తెలుస్తోంది. మధుకర్ మృతి కేసులో మంథని సీఐ ప్రభాకర్ మొదటి నుంచీ సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ముందే మధుది ఆత్మహత్య అని బంధువులతో చెప్పాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మరణంపై అనుమానాలు వ్యక్తం చేయగా ఎదురుప్రశ్నలతో నోరెత్తకుండా చేశాడని చెబుతున్నారు. మధుకర్ తల్లిదండ్రులు ఆరుగురిని అనుమానిస్తూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. ప్రభాకర్ ఇక్కడ పని చేస్తున్నప్పటి నుంచి వివాదాస్పదుడిగానే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు పలువురు చెబుతున్నారు. 7న రీ పోస్టుమార్టం మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని వివిధ సంఘాలు డిమాండ్ చేస్తుండటంతో పోలీసులు దిగొచ్చారు. రీ పోస్టుమార్టం జరపాలని మంథని తహసీల్దార్‌కు పోలీసులు లేఖ రాశారు. ఆయన కాకతీయ మెడికల్ కాలేజీకి లేఖ రాయడంతో ఈ నెల 7న రీ పోస్టుమార్టం చేసేందుకు తేదీ ఖరారైంది. అయితే మెడికల్ కాలేజీ వైద్యుల రీ పోస్టుమార్టంపై తమకు నమ్మకం లేదంటూ మృతుడి తల్లిదండ్రులు బుధవారం హైదరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. హైకోర్టు జడ్జి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. దీనిపై గురువారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారు తెలిపారు. -
పాక్‌ను చావుదెబ్బ తీసిన ఇండియన్ ఆర్మీ
-
సీఎం మాటలు నీటి మూటలేనా..?
► రూరల్ కార్యాలయ హామీకి తిలోదకాలు ► ఆందోళనలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు వరంగల్ క్రైం : కానిస్టేబుళ్ల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకుని హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లోనే రూరల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీకి పోలీస్ ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నారు. మళ్లీ రూరల్ కార్యాలయం తరలింపునకు యత్నాలు జరుగుతుండడంతో కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా నందనగార్డెన్స్‌లో ఏర్పాటు చేసి న సమావేశంలో రూరల్‌పోలీస్ కార్యాలయం హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేస్తామని, కమిషనరేట్, డీఐజీ కార్యాలయం కోసం ప్రస్తుతం డీఐజీ కార్యాలయం ఉన్న ప్రాంగణంలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమం త్రి ప్రకటనను కాదని మళ్లీ పోలీసు అధికారులు రూరల్ పోలీసు కార్యాలయం మామునూరుకు తరలించే య త్నాలు చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని పక్కకు పెట్టి కార్యాలయ తరలింపునకు కసరత్తు చేయడంపై పోలీసు కుటుంబ సభ్యు లు ఆందోళన చెందుతున్నారు. గతంలో కానిస్టేబుళ్లతోపాటు వారి కుటుంబ సభ్యుల పోరాటాల ఫలితంగా రూరల్ కార్యాలయం నగర సమీప ప్రాంతాలకు తరలిపోకుండా ఇక్కడే ఉండే పరిస్థితి ఏర్పడింది. చివరికి స్పందించిన ముఖ్యమంత్రి వారికి హెడ్‌క్వార్టర్స్‌లోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ రూరల్ కార్యాలయం తరలింపునకు యత్నాలు జరుగుతుండడంతో కానిస్టేబుళ్ల కుటుంబా లు ఆందోళనకు గురవుతున్నాయి. మళ్లీ హెడ్‌క్వార్టర్స్‌లోనే రూర ల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేవరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. స్వయంగా ముఖ్యమం త్రి హామీని బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ క ష్టాలను దృష్టిలో ఉంచుకుని హెడ్‌క్వార్టర్స్‌లోనే రూరల్కార్యాలయం ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. -
యాపిల్ హెడ్ ఆఫీసులో ఉద్యోగి మృతి
కాలిఫోర్నియా: అసలే ఈ ఏడాది నికర లాభాల్లో 13 శాతం నష్టాలు చవిచూసి బాధల్లో ఉన్న యాపిల్ కంపెనీకి మరో షాక్ తగిలింది. క్యూపర్టినో నగరంలో గల యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లోని 1 ఇన్ఫినిటీ క్యాంపస్ వద్ద బుధవారం ఉదయం ఒక ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. నగరంలోని యాపిల్ ఆఫీస్ నుంచి ఉద్యోగి మరణించినట్లు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు సమాచారం అందుకున్నారు. హుటాహుటిన 1ఇన్ఫినిటీలూప్కు చేరుకున్న పోలీసులు ఉద్యోగి శవాన్ని పరిశీలించారు. ఉద్యోగిది ఆత్మహత్యా? లేక హత్యా? అనే విషయాలను విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని క్యూపర్టినో నగర అధికారి షెరీఫ్ సెక్యూరిటీ డిప్యూటీ యురీనా తెలిపారు. ఓ వెబ్సైట్లో లభించిన ఆడియో టేపుల ప్రకారం అదే ఆఫీసులో పనిచేస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వ్యక్తి మరణానికి రెండు నిమిషాల ముందు ఆమె తలపై ఎవరో తుపాకీ కాల్చినట్లు చెబుతున్నారు. కానీ, అతని మరణానికి ఆమె ఏ విధంగా కారణమనే విషయం మాత్రం ఆ టేపులో వెల్లడించలేదు. ఈ ఆడియో వివరాలపై అధికారులు స్పందించలేదు. ఈ విషయం మీద తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎవరికి అపాయం లేదని అధికారులు చెప్పారు. ఘటనపై కంపెనీ ఇచ్చిన వివరాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు. పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత వివరాలను వెల్లడిస్తామన్నారు. అయితే, ఉద్యోగి మృతిపై యాపిల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
'రాజ్ భవనేమి ఆరెస్సెస్, బీజేపీ హెడ్ క్వార్టర్స్ కాదు'
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజ్ భవన్ ఆరెస్సెస్, బీజేపీ హెడ్ క్వార్టర్స్ కాదని ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ రజ్కోవా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ రాజ్ భవన్ ను గవర్నర్ రజ్కోవా బీజేపీ, ఆరెస్సెస్ ఉన్నత కార్యాలయంగా మార్చారని, వాటి ఏజెంట్ గా పనిచేస్తున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ స్పందిస్తూ 'నేను ఎవరికీ ఏజెంట్ ను కాదు. ఎప్పటికీ అలా ఉండను. నేనెప్పుడూ రాజ్ భవన్ ను రాజకీయ పార్టీల కార్యాలయంగా మార్చలేదు. భారత రాజ్యాంగానికి కట్టుబడిపనిచేస్తున్నాను. నేను రాజకీయనాయకుడిని కాదు.. ఏ పార్టీలో సభ్యుడిని కాదు. ఎప్పుడూ ఏపార్టీ ఆఫీసుకు కూడా వెళ్లలేదు. నేను నా పరిధిలోనే పనిచేస్తున్నాను' అని రజ్కోవా అన్నారు. రాష్ట్రపతి పాలన అనేది తాత్కాలికంగా మాత్రమే ఉంటుందని, తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి మరో ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అప్పటి వరకు శాంతిభద్రతలు, నేరాలు, అవినీతిని అదుపుచేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. -
కాబూల్‌లో బాంబు పేలుడు
కాబూల్: ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లో సోమవారం భారీ ఆత్మాహుతి కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో జరిగిన ఈ దాడిలో క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడి ఉన్నారని ప్రత్యక్ష సాక్షి అయిన ఓ వార్తా సంస్థ ఫోటో గ్రాఫర్ తెలిపారు. దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడిని ఆప్ఘన్ ఉన్నతాధికారులు దృవీకరించారు. -
గూగుల్ ప్రధాన కార్యాలయంలో మోదీ
కాలిఫోర్నియా: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత ఫేస్ బుక్ ప్రధాన కార్యలయాన్నిసందర్శించిన ఆయన అక్కడ ఫేస్ బుక్ ఖాతాదారులతో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్న అనంతరం సిలికాన్ వ్యాలీలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ మాజీ సీఈవో ఎరిక్ మిట్తో ప్రధానిమోదీ మాట్లాడారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి గూగుల్ మద్దతును ప్రధాని కోరారు. ఈ సందర్భంగా గూగుల్ ఎర్త్ గురించి సుందర్ పిచాయ్ ప్రధానికి వినిపించారు. దీంతోపాటు రానున్న రోజుల్లో 100 భారతీయ రైల్వే స్టేషన్లలో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని, అది వచ్చే ఏడాదినాటికి 400కు పెంచుతామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. -
'తొలిసారి మోదీ కంటతడి'
కాలిఫోర్నియా: ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి కంటతడి పెట్టారు. తన కన్నతల్లి గురించి మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి లోనవడమే కాకుండా ఎదుటి వారి మనసులను ద్రవింప జేశారు. కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మోదీ అనంతరం ఫేస్ బుక్ ఖాతాదారులతో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కన్నతల్లిని గురించి జూకర్ బర్గ్ ప్రశ్నించారు. మీ అభివృద్ధిలో మీ తల్లి పాత్ర ఎంతవరకు ఉందని బర్గ్ ప్రశ్నించగా.. 'మానాన్నగారు లేరు. మా అమ్మకు 90 ఏళ్లు దాటాయి. నా చిన్నతనంలో అందరి ఇళ్లలో నా తల్లి పాచిపని చేస్తుండేది. కూలిపనులకు వెళుతుండేది. ఆమె చదువుకోలేదు. కానీ టీవీ ద్వారా ప్రపంచంతో మమేకమవుతుంది. ప్రపంచంలో నా తల్లిలాంటి తల్లులు ఎందరో ఉన్నారు' అంటూ కళ్లు చెమర్చారు. దీంతోపాటు జూకర్ బర్గ్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక వ్యక్తిని ఈ ప్రపంచానికి ఆ తల్లిదండ్రులు ఇచ్చారని, ఆ వ్యక్తే ప్రపంచంగా మారాడని జూకర్ ను కొనియాడారు. -
కాంగ్రెస్, జేడీఎస్ బాహాబాహి
కార్యాలయాన్ని తక్షణమే అప్పగించాలని కాంగ్రెస్ నేతల పట్టు పోలీసుల జోక్యంతో శాంతించినఇరు పార్టీల కార్యకర్తలు బెంగళూరు : నిన్న మొన్నటి దాకా జేడీఎస్ ప్రధాన కార్యాలయం విషయమై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య రగిలిన చిచ్చు, ఇప్పుడిక షెడ్ నిర్మాణంతో మళ్లీ రాజుకుంది. నగరంలోని రేస్‌కోర్సు రోడ్డులో ఉన్న జేడీఎస్ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాల్సిందిగా కోర్టు తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో కార్యాలయం వెనక భాగంలో ఉన్న 16,100 అడుగుల స్థలంలో తాత్కాలికంగా ఓ షెడ్‌ను నిర్మించి, జేడీఎస్ కార్యకలాపాలను ఆ షెడ్లోకి మార్చిన అనంతరం ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ నిర్ణయించారు. ఇందులో భాగంగానే షెడ్ నిర్మాణ పనులు సైతం సాగుతున్నాయి. కాగా, ఇప్పుడు ఆ స్థలం కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందంటూ ఆ పార్టీ నేతలు జేడీఎస్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. జేడీఎస్ నేతలు షెడ్ నిర్మాణం తలపెట్టిన స్థలం సైతం ప్రధాన కార్యాలయం పరిధిలోనే ఉందని, అందువల్ల ఆ స్థలం కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని పేర్కొంటూ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేస్‌కోర్సు రోడ్డులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించారు. అదే సందర్భంలో కార్యాలయ అప్పగింత విషయమై తమ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయాన్ని వెల్లడించే వరకు సహనం వహించాలంటూ జేడీఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం నడిచింది. ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పోట్లాటకు దిగడంతో కార్యాలయ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు అధికారులు కల్పించుకొని ఇరు పార్టీల కార్యకర్తలకు సర్దిచెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసు అధికారులు అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్.హనుమంతప్ప, ఆర్.వి.వెంకటేష్, పి.ఆర్.రమేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ తరహా ప్రవర్తన సరికాదు.... కాంగ్రెస్ పార్టీ నేతలు, జేడీఎస్ కార్యాలయాన్ని సొంతం చేసుకునేందుకు ఈ విధంగా దౌర్జన్యానికి దిగడం ఏ మాత్రం సరికాదని జేడీఎస్ పార్టీ అధికార ప్రతినిధి వై.ఎస్.వి.దత్త పేర్కొన్నారు. జేడీఎస్ ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా విషయం తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతానికి చేరుకొని ఇరు ప్రాంతాల నేతలను సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...జేడీఎస్ పార్టీ నేతలు న్యాయవ్యవస్థకు ఎంతో విలువనిస్తారని, కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని నిర్ణయించామని చెప్పారు. అయితే ఈ విధంగా కార్యాలయంలోకి చొరబడి స్వాధీనం చేసుకోవాలనుకోవడం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు. -
పోలీసు హెడ్‌క్వార్టర్స్ నమూనా రెడీ
నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో గల 3.5 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించతల పెట్టిన నగర పోలీసు కమిషనర్ భవనం (హెడ్‌క్వార్టర్స్) నమూనా తయారైంది. ఈ నమూనాను ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్స్ ఆర్.చక్రపాణి అండ్ సన్స్ రూపొందించారు. ఈ నమూనాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు. దాదాపు ఇదే నమూనాకు చిన్నపాటి మార్పులు చేర్పులతో గ్రీన్‌సిగ్నల్ వేసే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు. నగర పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రాణాళిక బడ్జెట్ కింద నగర పోలీసు విభాగానికి రూ.116 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.20 కోట్లతో బంజారాహిల్స్‌లో దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా బహుళ అంతస్తులతో అత్యంత విశాలమైన పోలీసు ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే శంకుస్థాపన తేదీలు ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ భవనంలో కమిషనర్ కార్యాలయంతో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేస్తారు. -
విజయవాడలోనే ఆర్టీసీ కేంద్ర కార్యాలయం
విద్యాధరపురం స్థలానికి కమిటీ ఆమోదం ఇక్కడే వంద పడకల ఆస్పత్రి, గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం విజయవాడ : రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై నియమించిన నిపుణుల కమిటీ కూడా విజయవాడే సరైన ప్రాంతమని నిర్ణయించింది. దీంతో ఇక్కడ అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించేందుకు ఒక కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు పర్యటించి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇక్కడి విద్యాధరపురంలో ఉన్న ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఎండీ కార్యాలయాన్ని, గెస్ట్‌హౌస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లోని తార్నాకలో వంద పడకల ఆస్పత్రి ఉంది. ఇది రాష్ట్ర విభజనలో తెలంగాణకు వెళ్లిపోతుంది. దీంతో ప్రత్యామ్నాయంగా విజయవాడలో వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు. విద్యాధరపురం వర్క్‌షాప్ వద్ద ఉన్న డిస్సెన్సరీ స్థానంలోనే ఈ ఆస్పత్రి నిర్మించనున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న పాత బస్టాండ్ స్థలాన్ని కూడా స్వాధీనంలోకి తీసుకుని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని లీజుకిచ్చారు. ఈ వివాదం కోర్టులో ఉంది. రవాణా శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చే ట్రాన్స్పోర్ట్ అకాడెమీని విజయవాడకు సమీపంలోని గన్నవరంలో ఏర్పాటు చేయనున్నారు. గతంలో గన్నవరంలో ట్రాన్స్‌పోర్టు అకాడెమీ కోసం స్థలాన్ని సేకరించారు. అయితే, అది హైదరాబాద్‌కు తరలిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ జోనల్ శిక్షణ కళాశాల నడుస్తోంది. రాష్ట్ర విభజనతో మళ్లీ ఇక్కడే అకాడెమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్టీసీలోని సివిల్ ఇంజినీరింగ్ అధికారులు ఎండీ కార్యాలయం, గెస్ట్‌హౌస్, ట్రాన్స్‌పోర్టు అకాడెమీ, వంద పడకల ఆస్పత్రికి డిజైన్లను తయారుచేసి ఆమోదం కోసం పంపించినట్లు తెలిసింది. వీటికి ఆమోదముద్ర పడితే జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 13,300 బస్సులు, 69 వేల మంది ఉద్యోగులు సీమాంధ్రకు ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 217 డిపోలున్నాయి. 22,222 బస్సులతో లక్షా ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. విభజన పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు 69,600 మంది ఉద్యోగులు వస్తారు. ఈ ప్రాంతానికి 13,300 బస్సులను కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 707 మంది అధికారులు ఉండగా, 413 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించనున్నారు.