సీఎం మాటలు నీటి మూటలేనా..? | worried constables Family members | Sakshi
Sakshi News home page

సీఎం మాటలు నీటి మూటలేనా..?

Apr 30 2016 2:59 AM | Updated on May 29 2018 11:47 AM

కానిస్టేబుళ్ల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకుని హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లోనే రూరల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ..

రూరల్ కార్యాలయ హామీకి తిలోదకాలు
ఆందోళనలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు

 
వరంగల్ క్రైం : కానిస్టేబుళ్ల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకుని హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లోనే రూరల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీకి పోలీస్ ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నారు. మళ్లీ రూరల్ కార్యాలయం తరలింపునకు యత్నాలు జరుగుతుండడంతో కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా నందనగార్డెన్స్‌లో ఏర్పాటు చేసి న సమావేశంలో రూరల్‌పోలీస్ కార్యాలయం హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేస్తామని, కమిషనరేట్, డీఐజీ కార్యాలయం కోసం ప్రస్తుతం డీఐజీ కార్యాలయం ఉన్న ప్రాంగణంలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమం త్రి ప్రకటనను కాదని మళ్లీ పోలీసు అధికారులు రూరల్ పోలీసు కార్యాలయం మామునూరుకు తరలించే య త్నాలు చేస్తున్నారు.

సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని పక్కకు పెట్టి కార్యాలయ తరలింపునకు కసరత్తు చేయడంపై పోలీసు కుటుంబ సభ్యు లు ఆందోళన చెందుతున్నారు. గతంలో కానిస్టేబుళ్లతోపాటు వారి కుటుంబ సభ్యుల పోరాటాల ఫలితంగా రూరల్ కార్యాలయం నగర సమీప ప్రాంతాలకు తరలిపోకుండా ఇక్కడే ఉండే పరిస్థితి ఏర్పడింది. చివరికి స్పందించిన ముఖ్యమంత్రి వారికి హెడ్‌క్వార్టర్స్‌లోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ రూరల్ కార్యాలయం తరలింపునకు యత్నాలు జరుగుతుండడంతో కానిస్టేబుళ్ల కుటుంబా లు ఆందోళనకు గురవుతున్నాయి. మళ్లీ హెడ్‌క్వార్టర్స్‌లోనే రూర ల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేవరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. స్వయంగా ముఖ్యమం త్రి హామీని బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ క ష్టాలను దృష్టిలో ఉంచుకుని హెడ్‌క్వార్టర్స్‌లోనే రూరల్‌కార్యాలయం ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement