పాక్‌ పారా మిలటరీ హెడ్డాఫీసుపై ఉగ్ర దాడి | Terrorist Attack On Pakistan Paramilitary Headquarters | Sakshi
Sakshi News home page

పాక్‌ పారా మిలటరీ హెడ్డాఫీసుపై ఉగ్ర దాడి

Jun 28 2026 7:05 AM | Updated on Jun 28 2026 7:47 AM

Terrorist Attack On Pakistan Paramilitary Headquarters

కరాచీలోని పారా మిలటరీ విభాగం పాకిస్తాన్‌ రేంజర్స్‌ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గులిస్తాన్‌–ఇ– జౌహార్‌ ప్రాంతంలోని ఈ కార్యాలయం గేట్‌ను వాహనంతో ఢీకొట్టిన సాయుధులు లోపలికి వస్తూనే కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. బలగాలు వెంటనే ధీటుగా స్పందించాయన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లు తెలిసిందన్నారు.  

 రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) నుండి విడిపోయిన ఉగ్రవాద ముఠా 'జమాత్-ఉల్-అహ్రార్' ప్రకటించుకుంది. 'ఖులాఫా-ఎ-రషీదీన్ ఇష్తిషాదీ బ్రిగేడ్' అనే ఆత్మాహుతి దళం ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది.  పాకిస్తాన్‌లో ఇటీవల పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి.

 పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును ప్రారంభించాయి. కంట్రోల్ రూమ్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రవాదులు లోపలికి ఎలా ప్రవేశించారనే కోణంలో విచారణ చేపట్టారు. కరాచీలో హై అలర్ట్స్ ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement