
'తొలిసారి మోదీ కంటతడి'
ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి కంటతడి పెట్టారు. తన కన్నతల్లి గురించి మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి లోనవడమే కాకుండా ఎదుటి వారి మనసులను ద్రవింప జేశారు.
కాలిఫోర్నియా: ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి కంటతడి పెట్టారు. తన కన్నతల్లి గురించి మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి లోనవడమే కాకుండా ఎదుటి వారి మనసులను ద్రవింప జేశారు. కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మోదీ అనంతరం ఫేస్ బుక్ ఖాతాదారులతో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కన్నతల్లిని గురించి జూకర్ బర్గ్ ప్రశ్నించారు. మీ అభివృద్ధిలో మీ తల్లి పాత్ర ఎంతవరకు ఉందని బర్గ్ ప్రశ్నించగా..
'మానాన్నగారు లేరు. మా అమ్మకు 90 ఏళ్లు దాటాయి. నా చిన్నతనంలో అందరి ఇళ్లలో నా తల్లి పాచిపని చేస్తుండేది. కూలిపనులకు వెళుతుండేది. ఆమె చదువుకోలేదు. కానీ టీవీ ద్వారా ప్రపంచంతో మమేకమవుతుంది. ప్రపంచంలో నా తల్లిలాంటి తల్లులు ఎందరో ఉన్నారు' అంటూ కళ్లు చెమర్చారు. దీంతోపాటు జూకర్ బర్గ్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక వ్యక్తిని ఈ ప్రపంచానికి ఆ తల్లిదండ్రులు ఇచ్చారని, ఆ వ్యక్తే ప్రపంచంగా మారాడని జూకర్ ను కొనియాడారు.