ఎస్సీ గురుకుల సొసైటీలో 550 ఖాళీలు! | 550 Teacher Posts vacancies in SC Residential Society | Sakshi
Sakshi News home page

ఎస్సీ గురుకుల సొసైటీలో 550 ఖాళీలు!

Jun 20 2026 2:02 AM | Updated on Jun 20 2026 5:17 AM

550 Teacher Posts vacancies in SC Residential Society

రాష్ట్ర కార్యాలయానికి జోనల్‌ అధికారుల నివేదిక

ఇప్పటికే మంజూరైన పోస్టుల్లో ఖాళీల జాబితా రూపకల్పన

వీటిని పార్ట్‌టైమ్‌ టీచర్లతో భర్తీ చేయాలని నిర్ణయం

జిల్లా కలెక్టర్లకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నాయి. ఇప్ప టికే మంజూరైన పోస్టుల్లో ఉన్న ఖాళీలపై జోనల్‌ అధి కారులు పరిశీలన పూర్తి చేసిన సొసైటీ కార్యదర్శికి తాజాగా నివేదిక సమర్పించారు. ప్రస్తు తం ఎస్సీ గురుకుల సొసైటీలో బోధన కేటగిరీలో 550 ఖాళీలు న్నాయి. 

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, ఈనెల 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తరగ తులు ప్రారంభించడంతో బోధనా సిబ్బంది ఖాళీలను అధి గమించేందుకు సొసైటీ కార్యదర్శి కార్యాలయం క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఖాళీలను పరిశీలించిన జోనల్‌ అధికారులు కేట గిరీల వారీగా గుర్తించి నివేదిక సమర్పించారు. ఈ ఖాళీలన్నీ శాశ్వ త ప్రాతిపది కన ప్రభుత్వం మంజూరు చేసి న పోస్టులే. ప్రాధాన్యత క్రమంలో ఈ ఖాళీ లను పార్ట్‌ టైమ్‌ టీచర్లతో భర్తీ చేయాలని సొసైటీ కార్యాలయం నిర్ణయించింది.

జిల్లా కలెక్టర్ల అనుమతితో...
ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేలా జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిధిలోని ఖాళీల వివరాలను వెంటనే కలెక్టర్లకు అందించాలని గురుకుల సొసైటీ కార్యదర్శి సంబంధిత జోనల్‌ అధికారులను ఆదేశిస్తూ సర్క్యులర్‌ జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ అనుమతితో పార్ట్‌టైమ్‌ ఉద్యోగులను నియమించుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలో దాదాపు వెయ్యికి పైగా పార్ట్‌టైమ్‌ ఉద్యో గులున్నట్లు సమాచారం.

తాజాగా నియ మించుకునే వారికి కూడా ఇదే తరహా వేత నాలు ఇవ్వాలని సొసైటీ అధికారులు ప్రాథ మికంగా నిర్ణయించారు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే 2 విడతల్లో ప్రవేశా లను చేప ట్టిన అధికారులు ఈనెల 21వ తేదీలోగా ఆయా విద్యా ర్థులను నిర్దేశించిన పాఠశా లల్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు బోధన తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పార్ట్‌ టైమ్‌ టీచర్లను నియమించుకోవా లని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement