Residential Society
-
ఎస్సీ గురుకుల సొసైటీలో 550 ఖాళీలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నాయి. ఇప్ప టికే మంజూరైన పోస్టుల్లో ఉన్న ఖాళీలపై జోనల్ అధి కారులు పరిశీలన పూర్తి చేసిన సొసైటీ కార్యదర్శికి తాజాగా నివేదిక సమర్పించారు. ప్రస్తు తం ఎస్సీ గురుకుల సొసైటీలో బోధన కేటగిరీలో 550 ఖాళీలు న్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, ఈనెల 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తరగ తులు ప్రారంభించడంతో బోధనా సిబ్బంది ఖాళీలను అధి గమించేందుకు సొసైటీ కార్యదర్శి కార్యాలయం క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఖాళీలను పరిశీలించిన జోనల్ అధికారులు కేట గిరీల వారీగా గుర్తించి నివేదిక సమర్పించారు. ఈ ఖాళీలన్నీ శాశ్వ త ప్రాతిపది కన ప్రభుత్వం మంజూరు చేసి న పోస్టులే. ప్రాధాన్యత క్రమంలో ఈ ఖాళీ లను పార్ట్ టైమ్ టీచర్లతో భర్తీ చేయాలని సొసైటీ కార్యాలయం నిర్ణయించింది.జిల్లా కలెక్టర్ల అనుమతితో...ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేలా జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిధిలోని ఖాళీల వివరాలను వెంటనే కలెక్టర్లకు అందించాలని గురుకుల సొసైటీ కార్యదర్శి సంబంధిత జోనల్ అధికారులను ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అనుమతితో పార్ట్‌టైమ్ ఉద్యోగులను నియమించుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలో దాదాపు వెయ్యికి పైగా పార్ట్‌టైమ్ ఉద్యో గులున్నట్లు సమాచారం.తాజాగా నియ మించుకునే వారికి కూడా ఇదే తరహా వేత నాలు ఇవ్వాలని సొసైటీ అధికారులు ప్రాథ మికంగా నిర్ణయించారు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే 2 విడతల్లో ప్రవేశా లను చేప ట్టిన అధికారులు ఈనెల 21వ తేదీలోగా ఆయా విద్యా ర్థులను నిర్దేశించిన పాఠశా లల్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు బోధన తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పార్ట్ టైమ్ టీచర్లను నియమించుకోవా లని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
గురుకుల కాంట్రాక్టు సిబ్బందికి భారీ వేతనాలు
- జూనియర్ లెక్చరర్‌కు రూ.18 వేల నుంచి రూ.27 వేలకు పెంపు - పీజీటీకి రూ.16,100 నుంచి రూ.24,150కు.. - ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు పెంపుపై సందిగ్ధత - క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఫైలును వెనక్కి పంపిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర గురుకుల సొసైటీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బందికి ప్రభుత్వం భారీగా వేతనాలు పెంచింది. ఇప్పటివరకు నెలకు రూ.18 వేలు ఉన్న జూనియర్ లెక్చరర్ వేతనాన్ని రూ.27 వేలకు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)కు రూ.16,100 నుంచి రూ.24,150కి.. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)కి నెలకు రూ.14,800 నుంచి రూ.22,200 వేలకు పెంచింది. ఇక స్టాఫ్ నర్సుల వేతనాన్ని రూ.12,900 నుంచి రూ.19,350కు.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల (పీఈటీ)కు రూ.10,900 నుంచి రూ.16,350కి పెంచింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు (జీవో నం.27) జారీ చేశారు. ప్రభుత్వ కాలేజీల్లోని వారిపై సందిగ్ధత గురుకులాల్లో వేతనాల పెంపు నేపథ్యంలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ లెక్చరర్ల వేతనాల పెంపుపైనా చర్చలు మొదలయ్యాయి. దాదాపు 5 వేల మందికిపైగా కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచడంపై సందిగ్ధత నెలకొంది. ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ నెల రోజుల కింద కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ప్రస్తుతమున్న రూ.18 వేల వేతనాన్ని రూ.27 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు వారికి వేతనాల పెంపు అవసరం లేదని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల ఆ ఫైలును వెనక్కి పంపినట్లు సమాచారం. మరోవైపు క్రమబద్ధీకరణకు చాలా సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో వేతనాలను పెంచాలని జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.


