32 పేజీల పెళ్లి పత్రిక.. చూస్తేనే మతిపోతోంది.. | 32 Pages Marriage Invitation Card In Karimnagar, Photos Trending On Social Media | Sakshi
Sakshi News home page

32 పేజీల పెళ్లి పత్రిక.. చూస్తేనే మతిపోతోంది..

Feb 20 2025 9:49 AM | Updated on Feb 20 2025 10:41 AM

32 Pages Marriage Invitation Card

జమ్మికుంట(కరీంనగర్): పెళ్లి అంటే మామూలుగా పత్రిక అచ్చు వేయించి, బంధు మిత్రులకు పంచుతూ ఆహ్వానిస్తుంటారు. కానీ ఓ కుటుంబం ఏకంగా 32 పేజీలతో కూడిన పెళ్లి పత్రికను ముద్రించి, ఆహ్వానించడం పలువురిని ఆకట్టుకుంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన సుద్దాల శ్రీనివాస్‌– శ్రీదేవి దంపతుల పెద్ద కూతురు రవళి వివాహం ఈ నెల 23న నిశ్చయించారు. 

పెళ్లికి బంధు, మిత్రులను ఆహ్వానించేందుకు 32పేజీలతో కూడిన శుభలేఖను ముద్రించారు. ఇందులో వివాహ విశిష్టతకు సంబంధించిన సంస్కృతి, పెళ్లి చూపులు, పాణిగ్రహణం, జీలకర్రబెల్లం, తలంబ్రాలు వంటి పలు అంశాలను పొందుపరిచారు.

 

Advertisement
 
Advertisement
Advertisement