బైక్‌పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్‌ వదిలి పరార్‌.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్‌ వదిలి పరార్‌..

Aug 5 2023 9:40 AM | Updated on Aug 5 2023 9:40 AM

- - Sakshi

హైదరాబాద్‌: దొంగతనం కోసం వచ్చిన దుండగులు ఇంటి యజమాని అప్రమత్తమై కేకలు వేయడంతో తాము వచ్చిన బైక్‌ను అక్కడే వదిలేసి పరారైన ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాలివీ...షేక్‌పేట ఓయూ కాలనీ సమీపంలోని భగత్‌సింగ్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద నివసించే మెకానిక్‌ ఆంజనేయులు శుక్రవారం తెల్లవారుజామున అలికిడి రావడంతో లేచి చూశాడు. ఏసీ సందులో నుంచి ఓ చెయ్యి లోపలికి రావడం, తన పర్సును తస్కరించేందుకు యత్నించడంతో వెంటనే లేచి అరిచాడు. ఈ అరుపులకు ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారవుతుండగా ఆంజనేయులు బయటికి పరుగులు తీశాడు.

దొంగతనానికి వచ్చిన వ్యక్తితో పాటు మరొకరు కూడా ఉన్నట్లుగా గుర్తించాడు. ఇద్దరిని పట్టుకునేందుకు యత్నించగా వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దొంగతనానికి ఈ ఇద్దరూ వచ్చిన యాక్టివా బైక్‌ను అక్కడే వదిలేసి పోయారు. బాధితులు ఈ బైక్‌ను పోలీసులకు అప్పగించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement