
జగిత్యాల జోన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అక్కడే స్థిరపడ్డ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు నలమాసు ఓంకార్ కూడా పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో సాంకేతిక అంశాలపై ప్రధానితో ఆయన చర్చించారు.
అయితే, హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎంఫిల్ చేసిన ఓంకార్ సుమారు 30 ఏళ్ల కిత్రం అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆయన శానిఫ్రాన్సిస్కోలోని గ్లోబల్ చిప్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన