దంపతులతో సహా కుమారుడికి గాయాలు వెంబడించి డ్రైవర్‌ను పట్టుకుని
నిందితుడు నారాయణవనం వాసి
పళ్లిపట్టు: బైకును ఢీకొని ఆగకుండా వెళ్లిన కారును 15 కిలోమీటర్ల దూరం వెంబడించి ఓ యువకుడు కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని కొత్త కీచ్చలానికి చెందిన దాస్ కూలీ కార్మికుడు. అతని భార్య జీవిన, కొడుకు దరుణ్‌తో కలిసి ఆదివారం సాయంత్రం పొదటూరుపేట సంతకు వెళ్లి రాత్రి 8 గంటల సమయంలో బైకులో ఇంటికి వస్తుండగా, తిరుత్తణి రోడ్డు మార్గంలో కారు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడికి గాయాలయ్యాయి. స్థానికులు గాయాలపాలైన ముగ్గురిని 108 అంబులెన్సులో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా బైకును ఢీకొని వేగంగా వెళ్లిన కారును అక్కడే వున్న తమిళరసన్ అనే యువకుడు బైకులో 15 కిమీ దూరం వెంబడించి సత్రవాడ వద్ద కారును అడ్డుకున్నాడు. డ్రైవర్‌ను పట్టుకున్నాడు. తరువాత పొదటూరుపేట పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో ఆంధ్రాలోని నారాయణవనానికి చెందిన మౌలి(27) అని తేలింది.
పోలీసులకు అప్పగించిన యువకుడు


