–ఆంధ్రప్రదేశ్‌లోని
నెల్లూరు పెరుమాళ్ ఆలయానికి..
కొరుక్కుపేట: 20 టన్నుల నల్లరాయితో తయారు చేసిన 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని మహాబలిపురం కళాకారుల సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పెరుమాళ్ ఆలయానికి తరలించారు. నెల్లూరులోని పురాతన పెరుమాళ్ ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రతిష్ఠించడానికి మహాబలిపురంలో వాస్తు పూజలు నిర్వహించిన అనంతరం, 20 టన్నుల రాయితో చెక్కిన 21 అడుగుల ఎత్తైన ఆంజనేయ విగ్రహాన్ని ఒక భారీ 12–టైర్ల ట్రక్కులో తరలించారు. మహాబలిపురంలో ఓల్డ్ ఫైవ్ చారియట్ రోడ్‌లో ఉన్న ఒక రాతి శిల్పకళా స్టూడియోలో మహాబలిపురం శిల్పి ఎస్. రమేష్ స్థపతి నేతృత్వంలో, 20 మందికి పైగా శిల్పులు నెల రోజులుగా శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని వైష్ణవ ఆగమశాస్త్ర ప్రకారం చెక్కారు. ఆంజనేయ విగ్రహం ముఖం, కాళ్లు, దంతాలు, ఆభరణాలను చెక్కడానికి రేయింవళ్లూ శ్రమించి తుది రూపాన్ని ఇచ్చారు. విగ్రహం పని నూటికి నూరు శాతం పూర్తయ్యాక, నెల్లూరుకు తరలించారు.


