కొరుక్కుపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కొట్టి చంపిన సంఘటనలో సంతాపం వ్యక్తం చేయడానికి వచ్చిన తమిళగ వెట్రి కళగం (టివికే) మంత్రులను స్థానిక ప్రజలు ముట్టడించారు. వారిని నిలదీయడంతో గందరగోళం నెలకొంది. చైన్నెలో తిరువొత్తి న్యూ విమ్కో నగర్‌లోని జయగోపాల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ధనుష్ (17) తన తోటి విద్యార్థుల చేతి హతమయ్యాడు. తిరువొత్తియూర్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేసి, త్యాగరాజ తో సహా ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈలోపు ధనుష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, శ్రీటాయిలెట్‌లో గంజాయి సేవిస్తున్న పన్లీ ముఖంపైకి ఒక విద్యార్థి గంజాయి పొగ ఊదడంతో తలెత్తిన కక్ష కారణంగా తమ కుమారుడు ధనుష్‌ను హతమార్చారని, దీనికి కారకులైన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలి డిమాండ్ చేశారు .ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి మంత్రులు రాజ్ మోహన్, అధవ్ అర్జున, చైన్నె కలెక్టర్ హెలెన్ , డిప్యూటీ కమిషనర్ సెంథిల్‌నాథన్, తహసీల్దార్ దిలీప్, ఎమ్మెల్యే సెంథిల్ కుమార్ ధనుష్ తల్లిదండ్రులను కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ సమయంలో ధనుష్ బంధువులు, ప్రజలు ఆగ్రహంతో వారిని అడ్డుకున్నారు . భద్రతా విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదం చేశారు.
శ్రీఆ విద్యార్థిని అన్యాయంగా చంపారు..అతను చదువుతున్న పాఠశాలలో గంజాయి చాలా ఎక్కువగా ఉంది.. అక్కడ ధనుష్‌లా ఎవరూ బలికాకూడదు.. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి..పాఠశాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమకే పోలీసులు మంత్రిని అక్కడ నుంచి సురక్షితంగా తప్పించారు.
తిరుత్తణి: బాలికలు రుతుస్రావం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నర్సింగ్ విద్యార్థినులు అవగాహన కల్పించారు. తిరుత్తణిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆధ్వర్యంలో తిరుత్తణి ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాల విద్యార్థినులకు పరిశుభ్రతతో పాటు రుతుస్రావం సమయంలో తీసు కోవాలని జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో 8 నుంచి పదవ తరగతి బాలికలు పాల్గొన్నారు.
విజయ్‌కాంత్ జయంతిని..
నిర్వహించాలి
తిరుత్తణి: డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత విజయకాంత్ జన్మదినం పేదరిక నిర్మూలన దినంగా నిర్వహించి పేవలకు సహాయకాలు పంపిణీ చేయా లని కార్యకర్తల సమావేశంలో తీర్మానించారు. తిరువళ్లూరు వెస్ట్ జిల్లా డీఎండీకే ఆధ్వర్యంలో తిర్తుతణిలో కార్యకర్తల సమా వేశం ఆ పార్టీ అధ్యక్షుడు శరవనన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొని ఆగస్టు 25 కెప్టెన్ విజయకాంత్ జయంతి వేడుకలను ఎప్పటిలాగా పేదరికం నిర్మూలన దినంగా కోలాహలంగా కొనియాడాలని, ప్రతి యూనియన్‌లో విజయకాంత్ చిప్రపటాలు ఏర్పాటు చేసి నివాళులర్పించి పేదలకు సహాయకాలు, అన్నదానం పంపిణీ చేయాలని తీర్మానించారు. అలాగే రైతులకు పంట రుణాలు పూర్తిగా మాపీ చేయాలని, ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని తీర్మానాలు ఆమెదించారు. సమావేశంలో తిరుత్తణి, తిరువళ్లూరు,. పూందమల్లి నియోజకవర్గాల నుంచి రాష్ట్ర, జిల్లా, మండల , నగర, పట్టణ కార్యదర్శులు పాల్గొన్నారు.
తిరువొత్తియూరు: గుమ్మిడిపూండి సమీపంలోని బాలకృష్ణాపురం ప్రాంతానికి చెందిన సురేష్ కుమారుడు తమిళరసన్ (17). ఇతను బీహార్‌కు చెందిన దిల్కుష్ (16) అనే బాలుడు కలిసి సోమవారం తెల్లవారుజామున ఒకే మోటార్ సైకిల్‌పై కవరైపేట్టై నుంచి గుమ్మిడిపూండి వైపు వెళ్తూ మృత్యువాత పడ్డారు. మోటార్ సైకిల్‌ను తమిళరసన్ నడిపాడు. వేర్కాడు సమీపంలోకి వెళ్తున్న సమయంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తమిళరసన్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన దిల్కుష్‌నుచైన్నెలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ దిల్కుష్ మృతి చెందాడు. తమిళరసన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


