ముస్తాబైన భారతియార్‌ నివాసం | - | Sakshi
Sakshi News home page

ముస్తాబైన భారతియార్‌ నివాసం

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 7:16 AM

సాక్షి, చైన్నె: తూత్తుకుడి జిల్లా ఎట్టయపురంలోని మహాకవి సుబ్రమణ్య భారతియార్‌ జన్మించిన చారిత్రక నివాసం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీనిని త్వరితగతిన ప్రారంభించాలని భారతియార్‌ అభిమానులు, సాహితీవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నేపథ్యం – మరమ్మతు పనులు

ఎట్టయపురం టౌన్‌ పంచాయతీ 9వ వార్డు పెరుమాళ్‌ కోవిల్‌ వీధిలో భారతియార్‌ జన్మస్థలం ఉంది. గతేడాది మార్చి 25న ఈ భవనం ఆవరణలోని మొదటి అంతస్తు పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది. దీంతో పర్యాటకుల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసి, రూ.కోటి వ్యయంతో భవన ప్రాచీనత దెబ్బతినకుండా సాంప్రదాయ పద్ధతిలో (సున్నం, కడుక్కాయ్‌ పొడి మొదలైన మిశ్రమాలతో) పునరుద్ధరణ పనులకు పూనుకున్నారు. పనులన్నీ ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు అడ్డు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా భవనాన్ని ఇంకా ప్రజల సందర్శనకు తెరవకపోవడంపై సాహితీ అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది.

ఆలస్యానికి కారణం

భవనంలో ఉంచేందుకు కేటాయించిన దాదాపు 50 ప్రాచీన భారతియార్‌ ఛాయాచిత్రాలను చైన్నెకి పంపి పునరుద్ధరిస్తున్నామని, ఆ ఫోటోలు రాగానే అమర్చి ప్రభుత్వం తరఫున అధికారిక ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. సెప్టెంబర్‌ 11న భారతియార్‌ వర్ధంతి రానున్న నేపథ్యంలో, తమిళనాడు నలుమూలల నుంచి కవులు, రచయితలు, పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఎట్టయపురం చేరుకుంటారు. ఈ దృష్ట్యా, సెప్టెంబర్‌ 11 లోగానే ఈ నివాసాన్ని ప్రారంభించాలని భారతి ముర్పొక్కు వాలిబర్‌ సంగం కార్యదర్శి వి. బాలమురుగన్‌ డిమాండ్‌ చేశారు. ఒకవేళ తెరవకపోతే రచయితలు, భారతి అభిమానులతో కలిసి శాంతియుత నిరసనలకు పూనుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement