ఆకాశ్‌ ప్రతిభా పరీక్షకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ఆకాశ్‌ ప్రతిభా పరీక్షకు శ్రీకారం

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 7:16 AM

●రూ. 2.5 కోట్ల నగదు బహుమతులు ●100 శాతం వరకు స్కాలర్‌షిప్‌లు

సాక్షి, చైన్నె: ప్రసిద్ధి చెందిన శిక్షణ సంస్థ ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ తమ ప్రతిష్టాత్మక ప్రతిభా అన్వేషణ పరీక్ష ‘ఆకాశ్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌’ 2026 17వ ఎడిషన్‌ను సోమవారం ప్రారంభించింది. గడిచిన 16 ఏళ్లలో కోటి మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్న ఈ పరీక్ష విద్యార్థుల నైపుణ్యాలు, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేసే శాసీ్త్రయ వేదికగా గుర్తింపు పొందింది.

ప్రతిభా 2026 ప్రధాన ముఖ్యాంశాలు

5 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ పరీక్షకు అర్హులుగా ప్రకటించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్‌లతో పాటు మొత్తం రూ. 2.5 కోట్ల నగదు బహుమతులు అందించనున్నారు. పరీక్ష తేదీలు (ఆన్‌ లైన్‌)– అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 1, 2026 వరకు, పరీక్ష తేదీలు (ఆఫ్‌లైన్‌)– అక్టోబర్‌ 11, అక్టోబర్‌ 25, నవంబర్‌ 1 తేదీలలో నిర్వహించనున్నామని ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ఎండీ – సీఈఓ చంద్రశేఖర్‌ గారిసా రెడ్డి ప్రకటించారు. ఇది కేవలం స్కాలర్‌షిప్‌ పరీక్ష మాత్రమే కాదని, విద్యార్థులు తమ విద్యా సామర్థ్యాన్ని , బలాలను , మెరుగుపరచుకోవాల్సిన అంశాలను ముందుగానే తెలుసుకునేందుకు దోహదపడే ఒక అద్భుతమైన అవకాశంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement