సాక్షి, చైన్నె : తనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బ్రహ్మాండ ఆఫర్‌ఇచ్చినా, దానిని విస్మరించి తమిళనాడుకే వచ్చేనానని వి ది లీడర్స్ వ్యవస్థాపకుడు అన్నామలై వ్యాఖ్యానించారు. చైన్నెలో అన్నామలై నేతృత్వంలో వి ది లీడర్స్ ర్యాలీ జరిగింది. ఇందులో అన్నామలై ప్రసంగిస్తూ, టీవీకే ప్రభు త్వానికి కితాబులు, ప్రశంసలు ఇచ్చారు. వారికి ఒక సంవత్సరం కాలం పాటు సమయం ఇద్దామన్నారు. అప్పటికీ వారు పనిచేయకుంటే పనిచేయిద్దామన్నారు. తాజాగా వంద రోజుల పాలన పూర్తి కావొచ్చిందని పేర్కొంటూ, ఈ సమయంలో అనేక అంశాలను ప్రస్తావించామని, కొన్నింటిని వారు పరిగణించి తప్పులు సరిదిద్దుకున్నారని వ్యాఖ్యానించారు. సీఎం విజయ్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తున్నదన్నదని వివరిస్తూ ఇందుకు అభినందనలు తెలియజేశారు. అయితే, ఈ కొత్త ప్రభుత్వానికి సమయం అన్నది ఇవ్వకుండా ప్రధాన ప్రత పక్షాలు ఎప్పుడెప్పడు కూల్చేద్దామా? అని వ్యూహా లు రచిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వా న్ని కూల్చి గద్దెనేక్కాలన్న ఆశను వీడి ఈకొత్త పాలకులకు సమయాన్ని ప్రతి పక్షాలు కేటాయించాలని కోరారు. ఇక, తన విషయానికి వస్తే తాను బీజేపీకి బీ టీం ఏమాత్రం కాదన్నారు. తనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బ్రహ్మాండ ఆఫర్ ఇచ్చారని, అయితే, దానిని తమిళనాడు ప్రజల కోసం తాను తిరస్కరించాననని పేర్కొన్నారు. మూడేళ్లు తనను ఢిల్లీలో ఉండాలని ఆయన ఆదేశించారని, ఇది నిజం అని,కావాలంటే ఈనెల 20వ తేదిన చైన్నెకు రానున్న అమిత్‌షా ను ప్రశ్నించ వచ్చుఅని మీడియాకు సూచించారు. అమిత్‌షా ఢిల్లీకి రమ్మన్నారని, ఢిల్లీలోనే ఉండి పోమన్నారని? ఇది నిజమా? కాదా..? అని ప్రశ్నించ వచ్చు అని తెలిపారు.


