ఇష్టపడి డాక్టర్‌ అయ్యాను..! | - | Sakshi
Sakshi News home page

ఇష్టపడి డాక్టర్‌ అయ్యాను..!

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

ఇష్టపడి డాక్టర్‌ అయ్యాను..!

తమిళసినిమా: మనకు జీవితంపై ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తాం. అయితే విధి అనేది ఒకటి ఉంటుంది కదా. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేదు. ఎవరు ఏమి అనుకున్నా దాని రీతిలోనే నడవాల్సి ఉంటుంది. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకు నటి ఐశ్వర్య లక్ష్మినే తీసుకుంటే. ఈమె ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ పాపులర్‌ కథానాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు విశాల్‌కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటించిన కట్టా కుస్తీ –2 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతకు ముందు సూరి సరసన నటించిన మామన్‌ చిత్రం సక్సెస్‌ అయ్యింది. ఇకపోతే మూడు పదుల వయసు దాటినా ఈ భామ అవివాహితగానే జీవిస్తున్నారు. వివాహ బంధంపై పెద్దగా నమ్మకం లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. ఐశ్వర్య లక్ష్మి కేరళా కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఎకై క సంతానం. వారు తమ కూతురు బాగా చదువుకుని డాక్టర్లు కావాలని, పెళ్లి చేసుకుని ఒక మంచి వైద్యుడిని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా జీవించాలని ఆశపడ్డారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఐశ్వర్య లక్ష్మి చదువును చాలా ఇష్టంగా మనసు పెట్టి చదువుకున్నారు. తల్లి తండ్రుల కోరిక ప్రకారమే వైద్య విద్యలో ఉత్తీర్ణురాలై, హౌస్‌ సర్జరీ కూడా చేశారు. దీంతో ఆమె తల్లి దండ్రులు చాలా సంతోషించారు. అలాంటిది అనూహ్యంగా ఐశ్వర్య లక్ష్మి మోడలింగ్‌ రంగంలో ప్రవేశించారు. ఆ తరువాత సినీ రంగం ప్రవేశం చేశారు. ఐశ్వర్య లక్ష్మి సినిమాల్లో నటించడం ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు. తమ ఆశలు పూర్తిగా అడియాశలు అయ్యాయని ఎంతో బాధపడ్డారని దర్శకుడు అలెప్పి అష్రాప్‌ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. మనం అనుకున్నవి అన్నీ జరగవు అనడానికి నటి ఐశ్వర్య లక్ష్మి జీవితం చిన్న ఉదాహరణ అంతే.

నటి

ఐశ్వర్య లక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement