తమిళసినిమా: రాజగోపురంగళ్ పేరుతో దివంగత ప్రఖ్యాత దర్శకులు భారతీరాజా, కే.భాగ్యరాజాల సంస్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగాయి. దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో దర్శకల సంఘం, నిర్మాతల సంఘాల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కమలహాసన్ దర్శకులు భారతీరాజా, కే.భాగ్యరాజ్‌లో చిత్ర పటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘భారతి రాజా, కె.భాగ్యరాజా లిద్దరితో పని చేసినందుకు గర్వపడుతున్నాను. మనం అనేది అందరికీ వస్తుంది. అయితే వారు జీవించిన కాలంలో చేసిన కార్యాలు ఘనమైనవి. వీళ్లిద్దరూ తమిళ సినిమాలో బలంగా వేళ్లూరిన వాళ్లు. దర్శకుడు భారతిరాజా వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించినవారు. అపజయాలకు భయపడని వ్యక్తి భారతి రాజా వంటి కళాకారుడు లేరని దర్శకుడు కె.బాలచందర్ పేర్కొన్నారు. అలాంటి గొప్పవారితో పనిచేయటం నాకు ఘనత విజయాలు వస్తాయి. అపజయాలు వస్తాయి. వాటితో పాటు భజనపరులూ వస్తారు. ఇవన్నీటిని అధిగమించి ఉన్నత స్థాయిలో పయనించారు. కే.భాగ్యరాజా. భారతి రాజా ఒంటరి వ్యక్తి కాదు. అయినది పెద్ద కుటుంబం ఆయన్ని నేను చాలాసార్లు పరిహసించాను.. పలుమార్లు మా ఇంటికి వచ్చి పడుకునేవారు ఆయన్ని కేవలం దర్శకుడు అని ఎలా చెప్పగలను. ఆయన నా కుటుంబం. భారతీరాజా, భాగ్యరాజా లిద్దరు తమిళ సినిమాకు చిరునామాలు. వారు విజయాలు పొందడానికి ముందే ఎంతో సాధిస్తారని నేను గ్రహించాను. అదే జరిగింది. ఇకపోతే ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్నది భారతీయ చిత్ర పరిశ్రమ. ప్రభుత్వాలు సహకారంతో సినిమాను మరింత ప్రోత్సహించాలి’’అని కమలహాసన్ పేర్కొన్నారు.


