తిరువళ్లూరు: కూవం నదిలో పేరంబాక్కం వద్ద నిర్మిస్తున్న నూతన ఆనకట్ట పనులు దాదాపు పూర్తయ్యింది. తిరువళ్లూరు జిల్లా కేశవరం ప్రాంతం నుంచి కూవం నది ప్రవాహం ప్రారంభమవుతుంది. ఈ నది పేరంబాక్కం, కడంబత్తూరు, మనవాలనగర్, ఆరణ్‌వాయల్, పుదుసత్రం తదితర ప్రాంతాల మీధుగా సుమారు 72 కి.మీ సాగి చైన్నెలోని నేప్పియర్ బ్రిడ్జీ వద్ద బంగాళఖాతంలో కలుస్తుంది. కాగా కూవం నదిలో కేశవరం, పించివాక్కం, అధిగత్తూరు, పుట్లూరు, జమీన్‌కొరట్టూరు, పరుత్తిపట్టు తదితర ప్రాంతాల్లో ఆనకట్టలను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా నిల్వ వుంచే నీరు సాగు తాగునీరుకు ఉపయోగకరంగా మారుతూవుంది. ఈ క్రమంలోనే పేరంబాక్కం సమీపంలో కూవం నదిలో ఆనకట్టను నిర్మించాలని రైతులు, స్తానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల వినతి మేరకు గత డీఎంకే ప్రభుత్వం సుమారు రూ.5.98 కోట్లు వ్యయంతో ఆనటక్టను నిర్మాణానాకి భూమిపూజ చేసింది. సుమారు 85 మీటర్లు దూరం, 1.5 మీట్లు ఎత్తు, రెండువైపులా నాలుగు షట్టర్‌లతో పనులను ప్రారంబించారు. ప్రస్తుతం పనులు 90 శాతం మేరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు మరో 20 రోజుల్లో పూర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా పేరంబాక్కం వద్ద నిర్మిస్తున్న ఆనకట్ట ద్వారా కొండంజేరి, సత్రం, నర్సింగాపురం, కూవం తదితర 20 గ్రామాల్లో భూగర్భ జలమట్టం పెరగడంతో పాటూ సుమారు మూడువేల ఎకరలకు సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది.


