తమిళసినిమా: ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు అన్నది నానుడి. దాన్ని ఏ రంగంలోనైనా, ఎవరైనా చాటుకోవచ్చు. అలా మాయ ఎస్.కృష్ణన్ అనే కళాకారిణి తన స్టాండప్ కామెడీతో ప్రేక్షకులను ఫిదా చేశారు. నటి, వీధి భాగవత కళాకారిణి, రంగస్థల నటి ఇలా పలు ముఖాలు కలిగిన ఈమె ఇప్పుడు స్టాండప్ కామెడీలోను తన సత్తా చాటుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని మ్యూజిక్ అకాడమీలో స్టాండప్ కామెడీ షోను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మాయ ఎస్ కృష్ణన్ తన అద్భుతమైన నటన, హావభావాలు,చతురత సంభాషణలతో ప్రేక్షకులను అలరింపజేశారు. మంజుల టీచర్ అనే కల్పిత పాత్ర ద్వారా ఈమె సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, పక్షపాత ధోరణి, వ్యతిరేక ప్రచారం, పురుషాధిక్యత వంటి విషయాలను వ్యంగ్యంగా ప్రదర్శించి అందరినీ అలరించడంతో పాటూ ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. మారి ఎస్.కష్ణన్ సంభాషణలు, అభినయం అందరినీ ఫిదా చెప్పారు. ఆవరణలోని 1,500 మంది ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొట్టి ప్రశంసల వర్షం కురిపించారు.
స్టాండప్ కామెడియన్ మాయ ఎస్.కృష్ణన్


