కళలకు ప్రభుత్వ పోత్సాహం | - | Sakshi
Sakshi News home page

కళలకు ప్రభుత్వ పోత్సాహం

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

– వీణోత్సవంలో ఆరోగ్యమంత్రి డాక్టర్‌ కేజీ అరుల్‌రాజ్‌

కొరుక్కుపేట: తమిళనాడు అంటేనే సంగీత సాహిత్య కళలకు పెట్టింది పేరని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్‌ కే జి అరుల్‌ రాజ్‌ అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం సంగీత కళలను మరింతగా పోత్సహించేందుకు కృషి చేయనుందని అభిప్రాయపడ్డారు . ఈమేరకు రానున్న డిసెంబర్‌లో రాగమాలికలో శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం ను 10వేలమందితో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌గా కళారంజని చారిటబుల్‌ ట్రస్ట్‌ , శ్రీ కళారంజని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ , ఎతిరాజ్‌ మహిళా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో 40 మంది కళాకారులతో గ్రాండ్‌ వీణోత్సవం 2026ను నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి డాక్టర్‌ కేజి అరుల్‌ రాజ్‌ ,గౌరవ అతిథులుగా ఎతిరాజ్‌ మహిళా కళాశాల ఛైర్మెన్‌ విఎం మురళీధరన్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ జే బాలసుబ్రమణ్యన్‌ , సేవారత్న శోభారాజా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. శ్రీ కళారంజని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ జే శ్రీనిబాబు సారథ్యంలో 40మంది కళాకారులు వీణా వాయిద్యంతో ఆహుతులను మంత్రముగ్దులను చేశారు . మంత్రి అరుల్‌ రాజ్‌ మాట్లాడుతూ సంగీతం కళలలు అంటే తనకు చాలా ఇష్టం అని అందులోనూ వీణా వాయిద్యం వింటుంటే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. 10 వేలమందితో దశ సహస్ర గళార్చన చేయనున్న డాక్టర్‌ జే శ్రీనిబాబు కృషి సఫలికృతం కావాలని ఆకాంక్షిస్తూ అభినందించారు. అనంతరం శోభారాజా మాట్లాడుతూ వీణా అనేది కేవలం ఒక్క సంగీత వాయిద్యం మాత్రమే కాదని ,భారతీయ సంస్కృతి సంప్రదాయం , కళావైభవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ముందుగా కళారంజని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ సెక్రటరీ సేవారత్న ఆర్‌ రాజలక్ష్మీ స్వాగతపన్యాసం చేయగా, వ్యాఖ్యాతగా మెహర్‌ ఈసా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement