విద్య కోసం అదనపు నిధులు | - | Sakshi
Sakshi News home page

విద్య కోసం అదనపు నిధులు

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

– వీఐటీ చైన్నె స్నాతకోత్సవంలో చాన్స్‌లర్‌ జి. విశ్వనాథన్‌

కొరుక్కుపేట: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం అదనపు నిధులను కేటాయించాలని వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి. విశ్వనాథన్‌ అన్నారు.ఽ చైన్నె సమీపంలోని వండలూరులో ఉన్న వీఐటీ విశ్వవిద్యాలయం 14వ వార్షిక స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వీఐటీ చైన్నె మహాత్మాగాంధీ ఆడిటోరియవేదికగా జరిగిన ఈ సభకు జి. విశ్వనాథన్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి భారత ప్రభుత్వం డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ మాజీ సెక్రటరీ డాక్టర్‌ టి రామస్వామి , ప్రత్యేక అతిథిగా సదరన్‌ ఇండియా శ్రీలంక డిప్యూటీ హైకమీషనర్‌ డాక్టర్‌ గణేశనాతన్‌ గీతీశ్వరన్‌ , బెన్నెట్‌ కోలోమాన్‌ అండ్‌ కో లిమిటెడ్‌ బోర్డు మెంబర్‌ మోహిత్‌జైన్‌ లు పాల్గొని మొత్తం 4518 మంది (యుజీ, పీజీ,పిహెచ్‌డి) పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. డాక్టర్‌ జి. విశ్వనాథన్‌ పట్టభద్రులైన విద్యార్థులను అభినందిస్తూ మాట్లాడారు ‘భారత జనాభాలో కేవలం 13 శాతం మంది మాత్రమే పట్టభద్రులున్నారని, పట్టభద్రులే దేశ భవిష్యత్తుకు ప్రతినిధులు అని పేర్కొన్నారు. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, కానీ దాని వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా లేదు. మరో పోలికలో చెప్పాలంటే, కెనడాలో పట్టభద్రులయ్యే వారి శాతం సుమారు 66 శాతం కాగా, దక్షిణ కొరియా, జపాన్‌ వంటి దేశాలలో ఇది సుమారు 53 శాతంగా ఉంది. మనదేశంలో దేశ స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 3 శాతం మాత్రమే విద్యకు కేటాయించబడుతోంది, దీనిని 6 శాతానికి పెంచాలన్నారు. అనంతరం డాక్టర్‌ టి రామస్వామి మాట్లాడుతూ ఉన్నత విద్యను మార్చడంలోనే కాకుండా దేశనిర్మాణమనే బృహత్‌ ప్రక్రియకు గణనీయమైన తోడ్పాటు అందించడంలోనూ కూడా వీఐటీ అద్భుతమైనప్రాత పోషిస్తుందని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement