దరిచేరనున్న జిల్లా కార్యదర్శుల పదవులు | - | Sakshi
Sakshi News home page

దరిచేరనున్న జిల్లా కార్యదర్శుల పదవులు

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

● సీనియర్లపై అసంతృప్తి ● కసరత్తుల్లో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ● ఇక, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక జిల్లా ● సీనియర్లకు రాష్ట్ర కమిటీలో పదవులు

సాక్షి, చైన్నె: యువజన విభాగం, మహిళా విభాగానికి చెందిన నాయకులకు జిల్లా కార్యదర్శులుగా అవకాశం కల్పించి, పార్టీ పగ్గాలను యువత చేతికి అందించేందుకు స్టాలిన్‌ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అన్నాఅరివాలయంవ ర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం డీఎంకేలో 78 మంది జిల్లా కార్యదర్శులు ఉన్నారు. సీనియర్‌ నేతలు, కీలక జిల్లాల కార్యదర్శులు కొందరు తమ పరిధిలోని 4 నుండి 5 అసెంబ్లీ నియోజకవర్గాలను గుప్పిట్లో ఉంచుకుని ఆధిప్యతం చెలాయిస్తూ వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రతి 2 లేదా 3 నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శి ఉండేలా ఈ సంఖ్యను 110 కంటే ఎక్కువకి పెంచాలని స్టాలిన్‌ భావిస్తుండటం గమనార్హం.

70 ఏళ్లు దాటిన పెద్దలకు పదవీ గండం:

70 ఏళ్లు దాటినవారు , 3 సార్లకు పైగా జిల్లా కార్యదర్శులుగా పనిచేసిన ఎ.వి. వేలు, అనితా రాధాకృష్ణన్‌, ఎం.ఆర్‌.కె. పన్నీర్‌సెల్వం సహా 23 మంది సీనియర్‌ నేతలను జిల్లా బాధ్యతల నుంచి తప్పించనున్నారని సమాచారం. . వీరికి రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని అన్నా అరివాయలంలో చర్చజరుగుతున్నది. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సీనియర్లను తప్పించి, సుమారు 40 మందికి పైగా కొత్త వారికి (ముఖ్యంగా యువ నాయకులకు) జిల్లా కార్యదర్శి పదవులు కేటాయించనున్నారు.అలాగే, యువతలకు సైతం పదవులుదక్కనున్నాయి. దీంతో యువజన,మహిళా విబాగంలో ఉన్న వారికి పార్టీలో ప్రమోషన్‌ గ్యారంటీ అన్న సంకేతాలు వెలువడ్డాయి.

ఎంకే స్టాలిన్‌

అధిష్టానం.. జాగ్రత్తలు

పదవులు కోల్పోయే సీనియర్‌ నేతలు అసంతృప్తికి లోనై ఇతర పార్టీల్లోకి వెళ్తే రాజకీయంగా నష్టం జరుగుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. . అందుకే వారిని బుజ్జగించేందుకు పార్టీ కేంద్ర కమిటీలో కీలక పదవులు ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారు.జిల్లాల సంఖ్య పెంపు, కొత్త జిల్లాల కార్యదర్శులు,రాష్ట్ర స్థాయిపదవులు అంటూ పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించిన సమగ్ర జాబితా కసరత్తులను పూర్తి చేసిన తన వద్దే ఉంచుకునేందుకు స్టాలిన్‌ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ జాబితా గురించి ఈనెల 22న జరగనున్న డీఎంకే కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు.ఈ మార్పులపై సమగ్రంగా చర్చించి, అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement