సాక్షి, చైన్నె: రాష్ట్రంలో నీటి వనరుల పరిరక్షణ, సమర్థవంతమైన నీటి నిర్వహణే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా రూ. 500 కోట్ల వ్యయంతో చెరువులు, కాలువలు, ఇతర జలాశయాలను పునరుద్ధరించేబృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి కాలువలు, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు రూ. 500 కోట్లు కేటాయించారు. జలాశయాలను కాపాడుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజ లు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి ఎన్.ఆనంద్ కోరారు.
ఆక్రమణల తొలగింపు:జలాశయాల పరిధిలో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించి, రాబోయే వర్షాకా లం నాటికి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ‘భవిష్యత్ తరాల తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చాలంటే జలాశయాల పునరుద్ధరణే ఏకై క మార్గం. ప్రజలందరూ ప్రభుత్వంతో కలిసి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.


