సాక్షి, చైన్నె : తమిళనాడు శాసనసభకు తొలిసారిగా ఎన్నికై న ఎమ్మెల్యేలకు ప్రభుత్వమే కారు, వ్యక్తిగత సహాయకుడిని కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం వెలువడింది. వివరాలు.. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీవీకేకు చెందిన 107 మంది అత్యధిక సభ్యులుగా ఉన్నారు.వీరిలో సీఎం విజయ్‌తో పాటూ 90 శాతం మంది తొలి సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కిన వారే. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, వీసీకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ , ఎండీఎంకే ,డీఎండీకే తదితర పార్టీలలో ఇద్దరు ముగ్గురు కొత్త వారు ఉన్నారు. ఈసారి అసెంబ్లీకి ఎన్నికై న వారిలో మెజారిటీ శాతం కొత్త వారు, తొలి సారిగా అడుగు పెట్టినవారే ఉన్నారు. వీరికి అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వాల్సిన పరిస్థితిఏర్పడింది. టీవీకే నుంచి గెలిచిన వారిలో అత్యధిక శాతం అభిమానులే. వీరి ఆస్తి పస్తులు అంతంత మాత్రమే. అప్పోసొప్పో చేసి ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీలోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీసీకే చెందిన కాట్టుమన్నార్‌కోయిల్ ఎమ్మెల్యే జ్యోతిమణి మాట్లాడుతూ.. సభలో చెప్పులు కూడా వేసుకోలేని నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు.. నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు సేవ చేయడానికి తమకు సొంత వాహనాలు లేవు అని, అద్దె వాహనాల్లో తిరగాల్సి వస్తున్నట్టు వివరించారు. అలాగే సహాయకుడిని పెట్టుకుని జీతం ఇచ్చే ఆర్థిక స్థోమత కూడా లేదన్నారు. అవినీతి లేని పాలన అందించాలంటే ఎమ్మెల్యేల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేల నుండి వచ్చిన విజ్ఞప్తులను ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి తీసుకెళ్తానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు
సీఎం వద్దకు ప్రతిపాదన..
ఈ విషయంగా స్పీకర్ వినతిపత్రాన్ని సీఎం విజయ్‌కు పంపించారు. ఎమ్మెల్యేలు ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేలా చూడాలనే ఉద్దేశంతో.. తొలిసారి సభలోకి అడుగుపెట్టిన శాసనసభ్యులకు కారు, అసిస్టెంట్‌ను కేటాయించేందుకు సీఎం విజయ్ ఆమోదం తెలిపినట్లు, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ దృష్ట్యా,కారు కూడా లేని ఎమ్మెల్యేలందెరికో వాహనాలు మరికొద్ది రోజులలో దరి చేరనున్నాయి. ఎవ్వరెవ్వరికి కార్లు లేవో, వారి వివరాలను సేకరించి కార్ల కొనుగోలుకు సంబంఽధించిన కసరత్తులపైఅ ధికారులు దృష్టి పెట్టారు.


