పుదుచ్చేరి ఎన్డీయే కూటమిలో తీవ్ర విభేదాలు | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి ఎన్డీయే కూటమిలో తీవ్ర విభేదాలు

Jul 22 2026 12:30 AM | Updated on Jul 22 2026 12:30 AM

● మంత్రులకు శాఖల కేటాయింపులో ఆలస్యం ● గవర్నర్‌ వద్దకు పంచాయితీ

సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలోని ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రంగస్వామి. బీజేపీ మధ్య మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు భగ్గుమన్నాయి. బిజెపి మంత్రులకు కీలక శాఖలను కేటాయించకపోవడమే ఈ అంతర్గత వివాదానికి కారణంగా చర్చ జరుగుతున్నది. మంత్రుల శాఖల కేటాయింపునకు సంబంధించిన ఫైల్‌ ఆమోదంలో తీవ్ర ఆలస్యం జరుగుతుండటంతో వ్యవహారం గవర్నర్‌ కై లాష్‌నాథన్‌ వద్దకు చేరినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

శాఖల కేటాయింపు ఏదీ: పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ – బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర నెలలు కావస్తున్నా మంత్రులకు శాఖలను కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రంగస్వామిు రాజ్‌నివాస్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాష్‌నాథన్‌ను కలసి మంత్రుల శాఖల జాబితాను అందజేశారు. సాధారణంగా శాఖల జాబితా అందించిన గంట వ్యవధిలోనే అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. అయితే, ఈ జాబితాను విడుదల చేయకుండా నిలిపి వేసినట్టు సమాచారం.

సీఎం రంగన్నకు విన్నపం : గత ప్రభుత్వంలో కేటాయించిన కీలక శాఖలనే ఈసారి కూడా బిజెపి మంత్రులకు కొనసాగించాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి రంగ స్వామి తన మేన ళ్లుడు , బిజెపి మంత్రి అయిన నమశ్శివాయానికి ప్రాధాన్యత కలిగిన శాఖలను కేటాయించలేదని సంకేతాలు వెలువడ్డాయి. దీంతో నమశ్శివాయం నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని చర్చ.

సభాధిపతి పదవి పై వివాదం: శాఖల వివాదంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ పదవి కూడా కూటమిలో వివాదాన్ని రేపి ఉంది. బిజెపి పట్టుబట్టి స్పీకర్‌ పదవిని దక్కించుకునే వ్యూహంతో ఉండగా, సీఎం రంగస్వామి మాత్రం ఆ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వాలని భావించినట్లు సమాచారం. ఈ నిర్ణయం కూడా బిజెపి నాయకత్వంలో తీవ్ర అసంతృప్తికి దారితీసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సమర్పించిన మంత్రుల శాఖల ఉత్తర్వులు నిలిచిపోవడంతో ఎన్డీయే కూటమిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ , బీజేపీ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement