తమిళనాడులో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్న పలు కంపెనీల ప్రతిపాదనలకు ఈ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలపనుంది.
బడ్జెట్‌లో చేర్చాల్సిన ముఖ్యమైన అంశాలపై చర్చించడంతో పాటు, ముఖ్యంగా ఎన్నికల హామీ అయిన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించే పథకం అమలుకు ఈ కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోదం, కొత్త మార్గదర్శకాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మేఘదాతు డ్యాం వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం తరపున తదుపరి తీసుకోబోయే చట్టపరమైన, రాజకీయ చర్యలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సాక్షి, చైన్నె: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తన మొట్టమొదటి బడ్జెట్‌ను త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులలో సీఎం విజయ్ ఉన్నారు. ఈ పరిస్థితులలో అధికారంలోకి వచ్చినానంతరం సీఎం విజయ్ అధ్యక్షతన రెండవ కేబినెట్ సమావేశం గురువారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. వివరాలు.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం జూన్ 5న జరిగింది. ఆ సమావేశంలో శాఖల వారీగా 436 విజన్ ప్రాజెక్టులను అమలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అనంతరం గవర్నర్ అర్లేకర్ ప్రసంగంతో తొలి అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇది తమ మొదటి బడ్జెట్ కావడంతో, ప్రజలను ఆకట్టుకునేలా పలు వినూత్న పథకాలను ప్రకటించే అవకాశం ఉందని టీవీకే వర్గాలు భావిస్తున్నారు. బడ్జెట్‌లో చేర్చాల్సిన కొత్త పథకాలు, ఇప్పటికే అమలులో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, వివిధ శాఖల పనితీరుపై జూలై 2వ తేదీ నుంచి సీఎం విజయ్ ఆధ్వర్యంలో శాఖల వారీ సమీక్షలు జరుగుతూ వస్తున్నాయి. ఈ సమీక్షలు ఈనెల 22వ రకు కొనసాగనున్న నేపథ్యంలో గురువారం మంత్రి వర్గం భేటికి నిర్ణయించడంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్లయ్యింది. ఈనెల 16న ఉదయం 10.30 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
చర్చకు వచ్చే ప్రధానాంశాలు


