మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడు ప్రాంతానికి చెందిన రాధాకృష్ణన్‌(65). ఇతను భార్య వనజతో కలిసి నివాసం వుంటూ స్థానికంగా నిత్యవసర వస్తువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం భర్తకు భోజనం ఇచ్చి మధ్యాహ్నం ఇంటికి తిరుగుముఖం పట్టారు. అయితే సాయంత్రం నాలుగు గంటలకు రాధాకృష్ణన్‌ ఇంట్లో వంటమనిషిగా పని చేసే మహిళ ఇంటి వద్దకు రాగా తలుపులు వేసి వుండడంతో రాధాకృష్ణన్‌కు సమాచారం ఇచ్చింది. వెంటనే ఇంటి వద్దకు వచ్చి రాధాకృష్ణన్‌ వెనుక వైపు వెళ్లి చూడగా రక్తపు గాయాలతో వనజ మృతి చెంది వున్నట్టు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. తిరుపాళ్యవనం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణ చేయగా సిసిటివీ పుటేజీ ఆధారంగా పళవేర్కాడుకు చెందిన యుగేందర్‌ అలియాస్‌ అబ్దుల్‌రహ్మాన్‌ ప్రవర్త అనుమానస్పదంగా సంచరిస్తున్నట్టు పుటేజీలో విజివల్స్‌ కనబడడంతో అతడ్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో వనజను 15 సవర్ల బంగారు నగల కోసం హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement