పెంపుడు కుక్కపిల్లలు మృతి.. | - | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవపడి మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Oct 28 2024 12:56 AM | Updated on Oct 28 2024 10:52 AM

-

అన్నానగర్‌: కాంచీపురంలో పెంపుడు కుక్క పిల్లలు మురుగు కాలువలో పడి మృతి చెందడంతో భర్తతో ఏర్పడిన గొడవతో మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాంచీపురం తిరువీధి పల్లంకి చెందిన దిగేశ్వరన్‌. ఇతని భార్య గిరిజ(42). ఈమె చెంగల్‌పట్టు ఆల్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌. దిగేశ్వరన్‌ మధురవాయల్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. 

వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు లేకపోవడంతో కుక్కను పెంచుకున్నారు. పెంపుడు కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. వీటిలో రెండు సమీపంలోని కాలువలో పడి మృతిచెందాయి. ఈ విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గిరిజ శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement