ఘనంగా జరిగిన కోలీవుడ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌ వివాహం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జరిగిన కోలీవుడ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌ వివాహం

Sep 14 2023 7:08 AM | Updated on Sep 14 2023 12:26 PM

- - Sakshi

తమిళసినిమా: సీనియర్‌ నటుడు అరుణ్‌పాండియన్‌ చిన్న కూతురు నటి కీర్తీపాండియన్‌కు నటుడు అశోక్‌సెల్వన్‌కు బుధవారం ఉదయం వివాహం జరిగింది. సూదుకవ్వుం, ఓ మై కడవులే, పోర్‌ తొళిల్‌ వంటి చిత్రాల్లో నటించిన అశోక్‌సెల్వన్‌, తుంబా, అన్బుక్కు కినియాళ్‌ వంటి చిత్రాల్లో నటించిన కీర్తీపాండియన్‌ల మధ్య చాలా కాలం క్రితమే ప్రేమ మొలకెత్తింది. ఇరు కుటుంబాల అనుమతితో వీరి వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగింది.

కాగా బుధవారం ఉదయం తిరునల్వేలి జిల్లా రెడ్డియార్‌ పట్టి సమీపంలోని ఇట్టేరి గ్రామంలో అరుణ్‌పాండియన్‌ ఫామ్‌ హౌస్‌లో వివాహ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రలు పాల్గొన్నారు. కాగా ఈ సినీ జంట పెళ్లి రిసెప్షన్‌ చైన్నెలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఆ తేదీని ఇంకా వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement