200 కేజీల టమాటాల చోరీ | - | Sakshi
Sakshi News home page

200 కేజీల టమాటాల చోరీ

Jul 31 2023 12:40 AM | Updated on Jul 31 2023 8:38 PM

- - Sakshi

సాక్షి, చైన్నె: తిట్టకుడి మార్కెట్‌లో 200 కేజీల టమటాలు చోరీకి గురయ్యాయి. బాధిత వ్యాపారులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా తిట్టకుడి మార్కెట్‌లో పదికి పైగా టమాటా దుకాణాలున్నాయి. శనివారం రాత్రి దుకాణాలను మూసి వేసి ఇళ్లకు వ్యాపారులు వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూడగానే అనేక దుకాణాల తలుపులు పగుల కొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.

ఒక్కో దుకాణంలో 20 కేజీలు చొప్పున 200 కేజీల టమాటాలు చోరీకి గురైనట్లు విచారణలో తేలింది. దీంతో టమాటా దొంగలను పట్టుకునేందుకు ఆ పరిసర్లాలోని నిఘా కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టమాటా ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కిలో టమాటా కొన్నిచోట్ల రూ. 170, మరికొన్ని చోట్ల రూ. 200 ధర పలకడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement